Rajinikanth: ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు - ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ బ్రేక్‌-rajinikanth becomes highest paid actor with coolie movie breaks thalapathy vijay record ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajinikanth: ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు - ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ బ్రేక్‌

Rajinikanth: ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు - ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ బ్రేక్‌

Nelki Naresh Kumar HT Telugu
May 15, 2024 09:50 AM IST

Rajinikanth: ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబోలో వ‌స్తోన్న కూలీ మూవీ షూటింగ్ మొద‌లుకాక‌ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ కోసం ర‌జ‌నీకాంత్ 260 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ర‌జ‌నీకాంత్‌
ర‌జ‌నీకాంత్‌

Rajinikanth: ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ లోకేష్ క‌న‌గరాజ్ కాంబోలో రూపొందుతోన్న కూలీ మూవీ షూటింగ్ మొద‌లుకాక‌ముందే కోలీవుడ్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా థియేట్రిక‌ల్‌, ఓటీటీ బిజినెస్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. రికార్డు స్థాయిలో ఓటీటీ, థియేట్రిక‌ల్ రైట్స్ అమ్ముడుపోయిన‌ట్లు చెబుతోన్నారు.

జూన్ ఫ‌స్ట్ వీక్ నుంచి...

జూన్ ఫ‌స్ట్ వీక్ నుంచి చెన్నైలో కూలీ మూవీ షూటింగ్ ప్రారంభంకానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి. ఈ మూవీ కోసం చెన్నై ఫిలిం సిటీలో భారీగా సెట్స్ వేసిన‌ట్లు స‌మాచారం. కాగా ఈ సినిమా కోసం ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్ కోలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యాక్ష‌న్ డ్రామా మూవీకి ర‌జ‌నీకాంత్ 260 కోట్ల రెమ్యున‌రేష‌న్‌ను అందుకున్న‌ట్లు స‌మాచారం. కూలీ మూవీతో సౌత్ ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకున్న హీరోగా ర‌జ‌నీకాంత్ కొత్త రికార్డును క్రియేట్ చేసిన‌ట్లు కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తోన్నాయి.

రెమ్యున‌రేష‌న్ పెంచేసిన లోకేష్‌...

ర‌జ‌నీకాంత్‌కు ఇచ్చిన రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు. కోలీవుడ్‌లో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ అందుకున్న హీరోగా ఇప్ప‌టివ‌ర‌కు ద‌ళ‌ప‌తి విజ‌య్ నిలిచాడు.

కూలీతో అత‌డి రికార్డును ర‌జ‌నీకాంత్ బ్రేక్ చేసిన‌ట్లు త‌మిళ సినీ వ‌ర్గాలు చెబుతోన్నాయి. కూలీ మూవీ కోసం లోకేష్ క‌న‌గరాజ్ త‌న రెమ్యున‌రేష‌న్‌ను డ‌బుల్ చేసిన‌ట్లు స‌మాచారం. కూలీకు ముందు ఒక్కో మూవీ కోసం 30 నుంచి 40 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను డిమాండ్ చేసిన లోకేష్‌...ఈ మూవీ కోసం 60 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్న‌ట్లు చెబుతోన్నారు.

శృతి హాస‌న్‌...

కూలీ టైటిల్ టీజ‌ర్‌ను ఏప్రిల్‌లో రిలీజ్ చేశారు. యాక్ష‌న్ అంశాల‌తో ఈ టీజ‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్న‌ది. రికార్డు వ్యూస్‌ను ద‌క్కించుకున్న‌ది. కూలీ మూవీలో ర‌జ‌నీకాంత్ కూతురిగా శృతిహాస‌న్ న‌టిస్తోంది. ఈ యాక్ష‌న్ డ్రామా మూవీలో పృథ్వీరాజ్‌సుకుమార‌న్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.

వేట్టయాన్ షూటింగ్ కంప్లీట్‌...

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ వేట్టయాన్ సినిమా చేస్తోన్నాడు. ఈ సినిమాకు సంబంధించి మంగ‌ళ‌వారం నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ అప్‌డేట్‌ను రివీల్ చేసింది. ఈ మూవీకి సంబంధించి రజినీకాంత్ త‌న షూటింగ్‌ను పూర్తి చేసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. యూనిట్ సభ్యులు అంతా కలిసి రజినీకాంత్‌కి గ్రాండ్‌గా వీడ్కోలు పలికారు.ఫొటోల‌ను ట్విట్ట‌ర్‌లో లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ పోస్ట్ చేసింది. . ఈ మేరకు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ట్వీట్ వేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ సినిమాకు జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేళ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

అమితాబ్‌...ప‌హాద్ ఫాజిల్‌...

వేట్టయాన్ మూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు.ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌తో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. మంజు వారియ‌ర్‌, రితికా సింగ్, దుషార విజయన్ ఫిమేల్ లీడ్ పాత్ర‌ల‌ను చేస్తున్నారు. వెట్టైయాన్‌తో లాంగ్ గ్యాప్ త‌ర్వాత అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌జ‌నీకాంత్ క‌లిసి స్క్రీన్‌పై క‌నిపించ‌బోతున్నారు.

IPL_Entry_Point