Rajinikanth Birthday: రజనీకాంత్ బర్త్‌డే సెలబ్రేషన్స్ - ఫ్యామిలీతో సింపుల్‌గా - ఫొటోలు వైరల్
Rajinikanth Birthday: రజనీకాంత్ తన 73వ బర్త్‌డేను కుటుంబసభ్యుల మధ్య ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. రజనీకాంత్ పుట్టిన రోజు వేడుకల తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
Rajinikanth Birthday: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 73వ పుట్టినరోజును సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. మంగళవారం నాటితో రజనీకాంత్ 73వ వసంతంలోకి అడుగుపెట్టాడు. కుటుంబసభ్యుల సమక్షంలోనే పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నారు రజనీకాంత్. ఎలాంటి ఆడంబరాలు, హంగులు లేకుండా చాలా సింపుల్‌గా ఇంట్లోనే కేక్ కట్ చేశారు. రజనీకాంత్ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో ఆయన కూతుళ్లు, మనవళ్లతో పాటు మిగిలిన కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
రజనీకాంత్ బర్త్‌డే సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ లాల్ సలాంతో పాటు జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తోన్నాడు. లాల్ సలాం సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోంది.
లాల్ సలాం మూవీలో అతిథి పాత్రలో రజనీకాంత్ కనిపించబోతున్నారు. మరోవైపు టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషిస్తోన్నాడు. వీరితో పాటు రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది జైలర్‌తో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు రజనీకాంత్. నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఐదు వందల కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.