(1 / 5)
టిల్లు స్వ్కేర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రభంజనాన్ని సృష్టించింది. 130 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది తెలుగులో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది.
(2 / 5)
టిల్లు స్క్వేర్‌తో అనుపమ పరమేశ్వరన్ తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. అనుపమకు తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆమె కోరినంత మొత్తాన్ని ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి అంగీకరించినట్లు వార్తలొస్తున్నాయి.
(3 / 5)
టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అరవై లక్షల వరకు రెమ్యునరేషన్‌ను అనుపమ స్వీకరిస్తూ వచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
(4 / 5)
ఈ ఏడాది నాలుగు నెలల్లోనే తెలుగు, తమిళ భాషల్లో అనుపమ పరమేశ్వరన్ నటించిన మూడు సినిమాలు రిలీజయ్యాయి. తెలుగులో టిల్లు స్క్వేర్ హిట్టవ్వగా రవితేజతో చేసిన ఈగల్ ఫ్లాపయింది.
(5 / 5)
తమిళంలో జయంరవితో సైరన్ మూవీ చేసింది అనుపమ పరమేశ్వరన్. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇతర గ్యాలరీలు