RRR | తారక్, టైగర్ షూటింగ్ ఎలా చేశారు.. రాజమౌళితో సందీప్‌రెడ్డి వంగా ఇంటర్వ్యూ
RRR టీమ్ మూవీ ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా మూవీ డైరెక్టర్ రాజమౌళి.. అర్జున్‌రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
తన సినిమాలను హాలీవుడ్ రేంజ్‌లో చిత్రీకరించడం ఒక్క రాజమౌళికే చెల్లింది. ఈగ, బాహుబలిలాంటి మూవీస్‌తో తెలుగు సినిమాను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లిన ఘనత అతనిదే. యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయడంలో, గ్రాఫిక్స్‌ను వాడటంలో రాజమౌళిది ఓ ప్రత్యేక శైలి. అతను తీసిన సినిమాల మేకింగ్ వీడియోలకు కూడా ఫుల్ డిమాండ్ ఉండేది అందుకే.
ప్రతి సీన్‌ను అతను నటులకు వివరించే తీరు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ మూవీలోనూ రాజమౌళి స్టైల్ చిత్రీకరణ మనకు ట్రైలర్‌లోనే స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తారక్, పులి ఫేస్ టు ఫేస్ వచ్చే సీన్ గూస్‌బంప్స్ తెప్పించింది. అసలు ఈ సీన్‌ను ఎలా షూట్ చేశారన్న దానితోపాటు సినిమా షూటింగ్‌కు సంబంధించి ఎన్నో విశేషాలను అర్జున్‌రెడ్డి మూవీ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి వివరించారు.
ఇప్పుడీ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. సుమారు 57 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో మూవీ కోసం తాను, మిగిలిన టీమ్ కష్టపడిన తీరు, తారక్, రామ్‌చరణ్ నటన గురించి రాజమౌళి చెప్పారు. ఆ వీడియోను మీరూ చూడండి.