Rajamouli Mahesh Babu: మహేశ్ బాబుకు రాజమౌళి కండిషన్స్.. మొదలైన టార్చర్-rajamouli conditions to mahesh babu in diet over ssmb 29 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajamouli Mahesh Babu: మహేశ్ బాబుకు రాజమౌళి కండిషన్స్.. మొదలైన టార్చర్

Rajamouli Mahesh Babu: మహేశ్ బాబుకు రాజమౌళి కండిషన్స్.. మొదలైన టార్చర్

Sanjiv Kumar HT Telugu
Nov 26, 2023 01:29 PM IST

Rajamouli Mahesh Babu SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమా కోసం మహేశ్ బాబుకు కండిషన్స్ పెడుతున్నాడట జక్కన్న. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మహేశ్ బాబుకు రాజమౌళి కండిషన్స్.. మొదలైన టార్చర్
మహేశ్ బాబుకు రాజమౌళి కండిషన్స్.. మొదలైన టార్చర్

Rajamouli Conditions To Mahesh Babu: సర్కారు వారి పాట సినిమాతో మహేశ్ బాబు నుంచి ఏ మూవీ రాలేదు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు మూడోసారి హీరోగా చేస్తున్న సినిమా గుంటూరు కారం పలు కారణాలతో ఆలస్యం అవుతోంది. ఇక దర్శక దిగ్గజం రాజమౌళి మూవీ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జక్కన్న సినిమాను అందంగా చెక్కడానికి ఎన్నేళ్లు తీసుకుంటాడో చెప్పలేం.

ఇదిలా ఉంటే రాజమౌళి సినిమాలో పర్ఫెక్షన్ కోసం హీరోలను ఎంత కష్టపెడతాడో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ సమయంలో రామ్ చరణ్, తారక్ తమను చాలా టార్చర్ పెట్టినట్లు కూడా చెప్పుకొచ్చారు, ఇప్పుడు మహేశ్ బాబు వంతు వచ్చినట్లు తెలుస్తోంది. ఎస్ఎస్ఎంబీ 29కి ఇంకా స్టోరీ వర్క్ నడుస్తోంది. ఎప్పుడో మొదలు పెట్టాల్సిన ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే మహేశ్ బాబుకు కండిషన్స్ పెడుతున్నాడట జక్కన్న.

మహేశ్ బాబు ఒక డైట్ ఫాలో అయ్యే విధంగా న్యూట్రిషియన్‌ను రాజమౌళి అపాయింట్ చేశాడని టాక్. అయితే, సినిమాలే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా పర్ఫెక్ట్‌గా డైట్ మెయింటేన్ చేసే మహేశ్ బాబు పెద్దగా ఇబ్బంది పడలేదట. కానీ, ఇప్పుడు రోజుకి 8 గంటలు జిమ్ చేస్తూ ఆహార డైట్ కూడా ఫాలో అవ్వాల్సి వస్తోందని ఇన్ సైడ్ టాక్. గుంటూరు కారం సినిమా చిత్రీకరణను పూర్తి చేసే పనిలో ఉన్న మహేశ్ బాబుకు రెండింటిని బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారుతోందట.

రెగ్యులర్‌గా జిమ్, డైట్ విషయంలో ఇబ్బంది పడని మహేశ్ బాబుకు గుంటూరు కారం షూటింగ్, ఎస్ఎస్ఎంబీ 29 కోసం జిమ్, డైట్ రెండింటిని హ్యాండిల్ చేయడం కాస్తా కఠినంగా అనిపిస్తోందని మహేశ్ బాబు సన్నిహిత వర్గాల నుంచి ఓ టాక్ బయటకు వచ్చింది. ఏమైనా కానీ, డైట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనని మహేశ్ బాబుకు జక్కన్న సంకేతాలు పంపిస్తున్నాడట. ఇందులో ఎంతనిజం ఉందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ టాపిక్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Whats_app_banner