Raj Tharun Thiragabadara Saami: రాజ్ త‌రుణ్ కొత్త సినిమాకు మాస్ టైటిల్ ఫిక్స్‌-raj tarun as ravi kumar chowdary tiragabadara saami movie launched today ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raj Tharun Thiragabadara Saami: రాజ్ త‌రుణ్ కొత్త సినిమాకు మాస్ టైటిల్ ఫిక్స్‌

Raj Tharun Thiragabadara Saami: రాజ్ త‌రుణ్ కొత్త సినిమాకు మాస్ టైటిల్ ఫిక్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Dec 01, 2022 11:24 AM IST

Raj Tharun Thiragabadara Saami: రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ.ఎస్ ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న కొత్త సినిమా గురువారం హైద‌రాబాద్‌లో మొద‌లైంది. ఈ సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ మాస్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

రాజ్‌త‌రుణ్, ఎస్ ర‌వికుమార్ చౌద‌రి
రాజ్‌త‌రుణ్, ఎస్ ర‌వికుమార్ చౌద‌రి

Raj Tharun Thiragabadara Saami: కెరీర్‌లో ఎక్కువ‌గా ప్రేమ‌క‌థా చిత్రాల్లోనే క‌నిపించాడు రాజ్‌త‌రుణ్‌. సాఫ్ట్ టైటిల్స్‌తో ఇప్ప‌టివ‌ర‌కు సినిమాలు చేసిన అత‌డు తొలిసారి మాస్ టైటిల్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. అత‌డి కొత్త సినిమాకు తిర‌గ‌బ‌డ‌రా సామి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

ఈ సినిమాకు ఏ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. య‌జ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం లాంటి సినిమాల‌తో డైరెక్ట‌ర్‌గా పెద్ద విజ‌యాల్ని అందుకున్నాడు ఏ.ఎస్‌.ర‌వికుమార్ చౌద‌రి. కొంత విరామం త‌ర్వాత అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న‌ సినిమా ఇది. గురువారం పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈసినిమా మొద‌లైంది. తిర‌గ‌బ‌డ‌రా సామి సినిమాను సుర‌క్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మ‌ల్కాపురం శివ‌కుమార్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు జేబీ సంగీతాన్ని అందిస్తోన్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తిర‌గ‌బ‌డ‌రా సామి రూపొందుతోంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్నారు. రాజ్‌త‌రుణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన అహ నా పెళ్లంట వెబ్‌సిరీస్ ఇటీవ‌లే విడుద‌లైంది.

ఈ సిరీస్‌తో రాజ్‌త‌రుణ్ ఓటీటీలోకి అరంగేట్రం చేశాడు. శివాని రాజ‌శేఖ‌ర్ ఈ సిరీస్‌లో ప్ర‌ధాన పాత్ర‌ను పోషించింది. ప్ర‌స్తుతం రాజ్‌త‌రుణ్ న‌టించిన మ‌రికొన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్