Telugu News  /  Entertainment  /  Project K Team Released Special Poster On Prabhas Birthday
ప్రాజెక్ట్ కే
ప్రాజెక్ట్ కే

Prabhas Project k Poster: ప్ర‌భాస్ ప్రాజెక్ట్ కే స్పెష‌ల్ పోస్ట‌ర్ వ‌చ్చేసింది

23 October 2022, 14:10 ISTNelki Naresh Kumar
23 October 2022, 14:10 IST

Prabhas Project k Poster:ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్రాజెక్ట్ కే స్పెష‌ల్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Prabhas Project k Poster: ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు ప్రాజెక్ట్ కే టీమ్‌. స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. చేతిని మాత్ర‌మే చూపిస్తూ స్పెష‌ల్ గా డిజైన్ చేసిన ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు

బ్లాక్ అండ్ సిల్వ‌ర్ క‌ల‌ర్ క‌వ‌చంతో పంచ్ విసురుతున్న‌ట్లుగా ఉన్న ఈ పోస్ట‌ర్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. హీరోలు జ‌న్మించ‌రు. జ‌నాల నుంచి ఉద్భ‌విస్తారు అనే ఈ పోస్ట‌ర్‌కు క్యాప్ష‌న్‌ను జోడించారు. ఈ పోస్ట‌ర్‌తో పాటు క్యాప్ష‌న్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాను రూపొందిస్తున్నారు. దాదాపు ఐదు వంద‌ల కోట్ల వ్య‌యంతో రూపొందుతోన్న ఈ సినిమాలో దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాతోనే దీపికా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది. అమితాబ్‌బ‌చ్చ‌న్‌, దిశాప‌టానీ ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్వ‌నీద‌త్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్ 18న ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు.