Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్-preminchoddu hero anuroop reddy about director shirin sriram in teaser launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Preminchoddu: షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
May 17, 2024 04:15 PM IST

Anuroop Reddy About Preminchoddu 2024: ప్రేమించొద్దు మూవీ డైరెక్టర్‌ శిరిన్ శ్రీరామ్‌పై హీరో అనురూప్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రేమించొద్దు టీజర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమాను తీసేందుకు మూడేళ్లు పట్టిందని హీరో అనురూప్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్
షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు.. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాడు.. హీరో కామెంట్స్

Anuroop Reddy About Shirin Sriram: హీరో అనురూప్ రెడ్డి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రేమించొద్దు. ఈ సినిమాలో దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హీరో అనురూప్ రెడ్డి ఇదివరకు బంధూక్, శేఖరం గారి అబ్బాయి వంటి చిత్రాలతో అలరించాడు. ఇప్పుడు మరోసారి తెలుగు ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు అనురూప్ రెడ్డి వస్తోన్న సినిమానే ప్రేమించొద్దు. ఈ మూవీని శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై శిరిన్ శ్రీరామ్ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా ఈ మూవీ రూపొందింది.

ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ప్రేమించొద్దు మూవీ పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో విడుదల కానుంది. ప్రేమించొద్దు సినిమాను తెలుగులో జూన్ 7న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మే 16న టీజర్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు.

ప్రేమించొద్దు టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శిరిన్ శ్రీరామ్ ఆసక్తికర విషయాలు తెలిపారు. "మేం ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో తెరకెక్కించాం. ఏ భాషలో స్క్రీనింగ్ చేసినా కూడా స్ట్రెయిట్ ఫిల్మ్‌ అనేలా ఉందని ప్రశంసించారు. నాకు ఎంతగానో సహకరించిన టీంకు థాంక్స్. మా టీం అంతా తెరపై కనిపించనట్టుగా ఉండరు. చాలా కామ్‌గా ఉంటారు. మా సినిమా జూన్ 7న రాబోతోంది. అందరూ చూడండి" అని దర్శకనిర్మాత శిరిన్ శ్రీరామ్ అన్నారు.

"బంధూక్, శేఖరం గారి అబ్బాయి అనే సినిమాలు చేశాను. నాకు ఇది మూడో చిత్రం. ఎన్నో కష్టాలు పడి సినిమాను తీశాం. జూన్ 7న మా చిత్రం రాబోతోంది. ప్రతీ తల్లిదండ్రులు వారి పిల్లలకు దగ్గరుండి మరీ చూపించే సినిమా అవుతుంది. ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను అందరూ ఆదరించాలి" అని హీరో అనురూప్ రెడ్డి తెలిపారు.

"శిరీన్ అన్న ఇంతకు ముందు ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశారు. మూడేళ్లు కష్టపడి ఆయన ఈ మూవీని తీశారు. ఎంతో రియలిస్టిక్‌గా ఉంటుంది. మా సినిమాను ఆడియెన్స్ సపోర్ట్ చేయండి" అని ప్రేమించొద్దు కథానాయకుడు అనూరూప్ రెడ్డి కోరారు. ఇదిలా ఉంటే, ప్రేమించొద్దు మూవీని మొత్తం ఐదు భాషల్లో తెరకెక్కించారు.

ముందుగా జూన్ 17న తెలుగులో విడుదల చేయనున్నారు. ఆ అనంతరం త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ మూవీ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించే సినిమా అవుతుందని సూపర్‌వైజింగ్ నిర్మాత నిఖిలేష్ తొగరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆయన ప్రేమించొద్దు సినిమా చూసినట్లు, శిరీన్ ఏడిపించినట్లు, డైరెక్టర్ సినిమాను కాదు ఎమోషన్ తెరకెక్కించనట్లు నిఖిలేష్ తొగరి చెప్పుకొచ్చారు. మొదట్లో సినిమా తమిళ మూవీలా అనిపించిందని, తమిళ సినిమాటిక్ ఫ్లేవర్‌ను తెలుగులో చాలా సహజంగా తీసినట్లు ఆయన ప్రశంసించారు.

Whats_app_banner