Salaar Movie Update: షూటింగ్ చివరి దశలో సలార్.. ఇంకెన్ని రోజుల్లో పూర్తవుతుందంటే?-prabhas salaar shoot completed in 30 to 35 days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Salaar Shoot Completed In 30 To 35 Days

Salaar Movie Update: షూటింగ్ చివరి దశలో సలార్.. ఇంకెన్ని రోజుల్లో పూర్తవుతుందంటే?

Maragani Govardhan HT Telugu
Jan 17, 2023 01:30 PM IST

Salaar Movie Update: ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్. ఈ సినిమా షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. తాత్కాలికంగా బ్రేక్ తీసుకున్న ప్రభాస్... మరో రెండు, మూడు రోజుల్లో పాల్గొంటారు. ఈ నెలాఖరు వరకు నిరంతరాయంగా చిత్రీకరణ కొనసాగనుంది.

సలార్
సలార్

Salaar Movie Update: ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం సలార్. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్-2 లాంటి భారీ విజయం తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే సలార్ పోస్టర్లు సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో నిరూపించాయి. ఇప్పటికే సలార్ షూటింగ్ 85 శాతం పూర్తయింది. అయితే ఇటీవల కాలంలో ఈ సినిమా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

చిత్రబృందం షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చింది. ఇంకో 30 నుంచి 35 రోజుల షూటింగ్ జరిగితే సినిమా పూర్తవుతుంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని అర్థమవుతోంది. మరో రెండు, మూడు రోజుల్లో ప్రభాస్.. సలార్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశముంది. ఈ నెలాఖరు వరకు విరామం లేకుండా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరణలో మెజార్టీ భాగం పూర్తవుతుంది. మిగిలిన భాగం రాబోయే కొన్ని వారాల్లో పూర్తి చేయనున్నారు.

దీన్ని బట్టి చూస్తే ఫిబ్రవరి 20 కల్లా సినిమా షూటింగ్ పూర్తవుతుందన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే ప్రీ ప్రొడక్షన్స్ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ సినిమాను సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

హోంబలే ఫిల్మ్స్‌ తెలుగులో నిర్మిస్తున్న మొదటి చిత్రం సలార్. ప్రభాస్ ఈ చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ఇండియా స్థాయిలో అలరించనుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం