Prabhas Salaar Update: సలార్ కోసం యాక్ష‌న్‌లోకి దిగిన ప్ర‌భాస్‌-prabhas joins the latest schedule of salaar movie shooting in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Prabhas Joins The Latest Schedule Of Salaar Movie Shooting In Hyderabad

Prabhas Salaar Update: సలార్ కోసం యాక్ష‌న్‌లోకి దిగిన ప్ర‌భాస్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 21, 2022 06:17 AM IST

Prabhas Salaar Update: స‌లార్ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్‌లో ఆదివారం ప్ర‌భాస్ అడుగుపెట్టాడు. ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ కాంబినేష‌న్‌లో కీల‌క‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్స్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తోన్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌భాస్
ప్ర‌భాస్

Prabhas Salaar Update: ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తోన్న స‌లార్ కోసం దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ స‌లార్ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌లార్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

ఆదివారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో ప్ర‌భాస్ జాయిన్ అయిన‌ట్లు తెలిసింది. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌తో పాటు విల‌న్ పృథ్వీరాజ్ సుకుమార‌న్‌ల‌పై కీల‌క యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఈ యాక్ష‌న్ ఎపిసోడ్స్ కోసం హైద‌రాబాద్ రామోజీఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేసిన‌ట్లు తెలిసింది. ఈ సెట్స్‌లోనే పోరాట ఘ‌ట్టాల‌ను తెర‌కెక్కిస్తోన్న‌ట్లు చెబుతున్నారు.

స‌లార్ సినిమాలో వ‌ర‌ద‌రాజా మ‌న్నార్ అనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ క‌నిపించ‌బోతున్నారు. అత‌డి పాత్ర ప‌రిచ‌యానికి సంబంధించిన స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రించిన‌ట్లు తెలిసింది. ఇటీవ‌లే ఈ సినిమా సెట్స్‌ను పృథ్వీరాజ్ సుకుమార‌న్ వైఫ్ సుప్రియ సంద‌ర్శించింది.

స‌లార్ సినిమా అన్ని రికార్డుల‌ను బ్రేక్ చేస్తుంద‌ని ఆమె పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి మ‌రో రెండు షెడ్యూల్స్ మాత్ర‌మే బ్యాలెన్స్‌గా మిగిలిన‌ట్లు స‌మాచారం.

స‌లార్‌ సినిమాలో శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేసేందుకు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ స‌న్నాహాలు చేస్తోన్నారు. కేజీఎఫ్‌-2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా ఇది. కేజీఎఫ్‌ను నిర్మించిన హోంబ‌లే ఫిల్మ్స్ సంస్థ స‌లార్ సినిమాను దాదాపు రెండు వంద‌ల కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది.

IPL_Entry_Point