Ponniyin Selvan Box Office Records: ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన పొన్నియిన్‌ సెల్వన్‌-ponniyin selvan creates several overseas box office records
Telugu News  /  Entertainment  /  Ponniyin Selvan Creates Several Overseas Box Office Records
ఓవర్సీస్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్న పొన్నియిన్ సెల్వన్
ఓవర్సీస్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్న పొన్నియిన్ సెల్వన్

Ponniyin Selvan Box Office Records: ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన పొన్నియిన్‌ సెల్వన్‌

03 October 2022, 15:42 ISTHT Telugu Desk
03 October 2022, 15:42 IST

Ponniyin Selvan Box Office Records: ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ రికార్డులు బ్రేక్‌ చేసింది మణిరత్నం మూవీ పొన్నియిన్‌ సెల్వన్‌ 1 మూవీ. మూడు రోజుల్లోనే ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లతో దూసుకెళ్తోంది.

Ponniyin Selvan Box Office Records: భారీ బడ్జెట్‌, భారీ తారాగణం, ఎన్నో అంచనాల మధ్య రిలీజైన పొన్నియిన్‌ సెల్వన్‌ 1 మూవీ బాక్సాఫీస్‌ దగ్గర దూసుకెళ్తోంది. తమిళనాడులో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే రికార్డులు తిరగరాసిన ఈ మూవీ.. ఇప్పుడు ఓవర్సీస్‌లోనూ కొన్ని బాక్సాఫీస్‌ రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.

తమిళ ప్రైడ్‌ అంటూ కేవలం తమిళ ప్రేక్షకుల కోసమే తీసినట్లుగా ఉందన్న విమర్శలు సినిమాపై ఉన్నా.. ఇటు తెలుగు మార్కెట్‌లో, అటు ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఈ క్రమంలోనే ఓవర్సీస్‌ బాక్సాఫీస్‌ దగ్గర ఈ పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ కొన్ని రికార్డులను బ్రేక్‌ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పొన్నియిన్‌ సెల్వన్‌ రికార్డులు

రెండు భాగాలుగా వస్తున్న ఈ పొన్నియిన్‌ సెల్వన్‌లో తొలి భాగం సెప్టెంబర్‌ 30న రిలీజైన విషయం తెలిసిందే. తమిళంతోపాటు ఇతర సౌతిండియా భాషలు, హిందీలోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రేడ్‌ అనలిస్ట్‌ రమేష్‌ బాలా ప్రకారం.. ఈ సినిమా తమిళనాడుతోపాటు ఓవర్సీస్‌ మార్కెట్‌లో మంచి వసూళ్లు రాబడుతోంది.

అతను చెప్పిన దాని ప్రకారం.. యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఓ తమిళ మూవీ ఆల్‌టైమ్‌ నంబర్‌ 1 వీకెండ్‌ కలెక్షన్లు రాబట్టింది పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమా. ఒక్క అమెరికాలోనే ఈ సినిమా ఇప్పటి వరకూ 40 లక్షల డాలర్లు వసూలు చేసింది. అమెరికాలో 40 లక్షల డాలర్లకుపైగా వసూలు చేసిన తొలి రజనీకాంత్‌ నటించని తమిళ మూవీ ఇదే.

ఇక అమెరికాలో బాహుబలి2, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌2 తర్వాత 40 లక్షల డాలర్లుపైగా వసూలు చేసిన నాలుగో సౌత్‌ మూవీగా కూడా పొన్నియిన్‌ సెల్వన్‌ నిలిచింది. ఈ సినిమా అటు యూఏఈ, మలేషియా, సింగపూర్‌, శ్రీలంకల్లోనూ బాక్సాఫీస్‌ రికార్డులను బ్రేక్‌ చేస్తోంది. ఐమ్యాక్స్‌ పార్మాట్‌లోనూ రిలీజైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఐమ్యాక్స్‌లలోనూ రికార్డ్ ఓపెనింగ్‌లు సాధించింది.

మొత్తంగా మూడు రోజుల్లో రూ.230 కోట్లు వసూలు చేయగా.. అందులో రూ.110-120 కోట్లు ఓవర్సీస్‌ మార్కెట్‌ నుంచే వచ్చినట్లు రమేష్‌ బాలా చెప్పాడు. తమిళనాడులో పొన్నియిస్‌ సెల్వన్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ అని అతడు తేల్చేశాడు. తెలుగు, హిందీ వెర్షన్‌లలో మాత్రం ఈ మూవీ కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నట్లు చెప్పాడు. ఇక ఈ సినిమా మొత్తంగా రూ.500-550 కోట్లు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, ఓవర్సీస్‌ మార్కెట్‌లలో ఇప్పటి వరకూ చేసిన వసూళ్లను బట్టి అంచనా వేస్తున్నారు.