Ponniyin Selvan Day 1 Collection: పొన్నియ‌న్ సెల్వ‌న్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - త‌మిళంలో టాప్ త్రీ గ్రాస‌ర్‌గా రికార్డ్‌-mani ratnam ponniyin selvan day 1 collection third highest opening grosser in kollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Mani Ratnam Ponniyin Selvan Day 1 Collection Third Highest Opening Grosser In Kollywood

Ponniyin Selvan Day 1 Collection: పొన్నియ‌న్ సెల్వ‌న్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - త‌మిళంలో టాప్ త్రీ గ్రాస‌ర్‌గా రికార్డ్‌

పొన్నియ‌న్ సెల్వ‌న్
పొన్నియ‌న్ సెల్వ‌న్ (Twitter)

Ponniyin Selvan Day 1 Collection: విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం కెరీర్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్ సినిమాగా పొన్నియ‌న్ సెల్వ‌న్ నిలిచింది. శుక్ర‌వారం ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తొలిరోజు పొన్నియ‌న్ సెల్వ‌న్‌కు వ‌చ్చిన వ‌సూళ్లు ఎంతంటే...

Ponniyin Selvan Day 1 Collection: మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చారిత్ర‌క చిత్రం పొన్నియ‌న్ సెల్వ‌న్ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజైంది. త‌మిళ స్టార్ హీరోలు విక్ర‌మ్‌, కార్తి, జ‌యంర‌వి న‌టించిన ఈ మ‌ల్టీస్టార‌ర్ సినిమా తొలిరోజు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 82 కోట్ల గ్రాస్‌, 42 కోట్ల షేర్‌ క‌లెక్ష‌న్స్‌ సాధించింది. త‌మిళంలో శుక్ర‌వారం రోజు ఈ సినిమా 25.86 క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. 2022 ఏడాదిలో తొలిరోజు అత్య‌ధిక వ‌సూళ్ల‌ను సాధించిన త‌మిళ సినిమాల్లో టాప్ త్రీ ప్లేస్‌లో పొన్నియ‌న్ సెల్వ‌న్ నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ జాబితాలో 36 కోట్ల‌తో అజిత్ వ‌లీమై ఫ‌స్ట్ ప్లేస్‌లో నిల‌వ‌గా విజ‌య్ బీస్ట్ 26 కోట్ల క‌లెక్ష‌న్స్‌తో సెకండ్ ప్లేస్‌ను ద‌క్కించుకున్న‌ది. ఆ సినిమాల త‌ర్వాత అత్య‌ధిక ఓపెనింగ్స్‌ను పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ వ‌న్ రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఈ సినిమా 5.50 గ్రాస్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నైజాంలోనే కోటిన్న‌ర షేర్‌ను రాబ‌ట్టింది. హిందీలో శుక్ర‌వారం రోజు 1.5 కోట్ల షేర్ ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. కేర‌ళ‌లో 3.20, క‌ర్ణాట‌క‌లో 4.05 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు చెబుతున్నారు. ఓవ‌ర్ సీస్‌లో 40 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది.

వ‌ర‌ల్డ్ వైడ్ గా తొలిరోజు ఈ సినిమా ఈ సినిమా 82 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సొంతం చేసుకున్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. క‌ల్కి కృష్ణ‌మూర్తి రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ న‌వ‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కించారు. చోళ సామ్రాజ్య రాజు సుంద‌ర‌చోళుడి కుమారులు క‌రికాల చోళుడు, అరుళ్ మోళి శ‌త్రువుల‌ను ఎదురించి సాగించిన పోరును పార్ట్ 1లో చూపించారు.

విజువ‌ల్స్‌, యాక్ష‌న్ ఎపిసోడ్స్, యాక్టింగ్‌ బాగున్నాయ‌నే పేరువ‌చ్చినా క‌థ‌, క‌థ‌నాలు నెమ్మ‌దిగా సాగ‌డంతో త‌మిళం మిన‌హా మిగిలిన చోట్ల పొన్నియ‌న్ సెల్వ‌న్‌కు మిక్స్‌డ్‌ టాక్ వ‌స్తోంది. ఈ సినిమాలో విక్ర‌మ్‌(Vikram), జ‌యంర‌వి(Jayam ravi), కార్తి, ఐశ్వ‌ర్యారాయ్‌(Aishwarya rai), త్రిష‌, శ‌ర‌త్‌కుమార్‌, ఐశ్వ‌ర్య‌ల‌క్ష్మి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఏ.ఆర్‌.రెహ‌మాన్(Ar rahman) సంగీతాన్ని అందించాడు.

టాపిక్