Pawan Kalyan on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పండగే-pawan kalyan on instagram with over 7 lakh followers without a post ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pawan Kalyan On Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పండగే

Pawan Kalyan on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పండగే

Hari Prasad S HT Telugu
Jul 04, 2023 02:12 PM IST

Pawan Kalyan on Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోకి పవన్ కల్యాణ్ వచ్చేశాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇక పండగే. పవన్ అధికారిక పేజీ లింక్ ను మంగళవారం (జులై 4) జనసేన పార్టీ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

పవన్ కల్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వచ్చేసిందంటూ జనసేన చేసిన ట్వీట్
పవన్ కల్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వచ్చేసిందంటూ జనసేన చేసిన ట్వీట్

Pawan Kalyan on Instagram: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. తమ అభిమాన నటుడు పవన్ ను ఇక ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో కావచ్చు. అతడు చేసే పోస్టులను చూస్తూ మురిసిపోవచ్చు. ఎట్టకేలకు ఈ స్టార్ హీరో ఇన్‌స్టాగ్రామ్ లో తనకంటూ ఓ పేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అతని అధికారిక పేజీని జనసేన పార్టీ మంగళవారం (జులై 4) తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.

పవన్ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు.. అప్పుడే సుమారు 8 లక్షల మంది (మధ్యాహ్నం 2 గంటల వరకు) ఫాలోవర్లు వచ్చేయడం విశేషం. ప్రతి నిమిషానికి ఫాలోవర్ల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. పవర్ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ కు ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు. అయితే తన ఇన్‌స్టా అకౌంట్ ను పవన్ చాలా వరకూ తన రాజకీయ అవసరాల కోసమే ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి.

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాల్లో బిజీ అవుతున్న పవన్.. ఈ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులు, ప్రజలకు చేరువ కానున్నాడు. ట్విటర్ ప్రొఫైల్ పిక్ లాగే ఇన్‌స్టా పిక్ కూడా అదే ఉంది. ఎలుగెత్తు, ఎదిరించు, ఎన్నుకో.. జై హింద్ అని పవన్ బయోలో రాసి ఉండటం విశేషం. ఇన్‌స్టాలోకి పవన్ వచ్చాడన్న వార్త మంగళవారం ఉదయం నుంచి వైరల్ గా మారింది.

గంటల వ్యవధిలోనే లక్షల మంది పవన్ పేజీని ఫాలో అయ్యారు. వారాహి యాత్ర చేస్తున్న పవన్.. జనసేన కార్యకలాపాల్లో బిజీగా ఉంటూనే ఇటు సినిమాలూ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లలో బిజీగా ఉన్నాడు. పవన్ నటించిన బ్రో మూవీ జులై 28న రిలీజ్ కానుంది. అటు ఓజీ కూడా సగం షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ ఇన్‌స్టా పేజ్ లోకి వెళ్లాలంటే https://www.instagram.com/pawankalyan/?hl=en పై క్లిక్ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం