Pakistan Movie: పదేళ్ల తర్వాత ఇండియాలో రిలీజ్ అవుతున్న తొలి పాకిస్థాన్ మూవీ ఇదే.. రూ.100 కోట్ల కలెక్షన్లు..-pakistani movie the legend of maula jatt releasing in india first movie to release after 10 years ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pakistan Movie: పదేళ్ల తర్వాత ఇండియాలో రిలీజ్ అవుతున్న తొలి పాకిస్థాన్ మూవీ ఇదే.. రూ.100 కోట్ల కలెక్షన్లు..

Pakistan Movie: పదేళ్ల తర్వాత ఇండియాలో రిలీజ్ అవుతున్న తొలి పాకిస్థాన్ మూవీ ఇదే.. రూ.100 కోట్ల కలెక్షన్లు..

Hari Prasad S HT Telugu
Sep 19, 2024 03:33 PM IST

Pakistan Movie: పాకిస్థానీ మూవీ ఒకటి పదేళ్ల తర్వాత ఇండియాలో రిలీజ్ అవుతోంది. ఆ దేశంలో రూ.100 కోట్లకుపైగా వసూలు చేసి.. రెండేళ్లుగా హౌజ్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ మూవీ.. ఇప్పుడు ఇండియాలో రిలీజ్ కానుండటం విశేషం.

పదేళ్ల తర్వాత ఇండియాలో రిలీజ్ అవుతున్న తొలి పాకిస్థాన్ మూవీ ఇదే.. రూ.100 కోట్ల కలెక్షన్లు..
పదేళ్ల తర్వాత ఇండియాలో రిలీజ్ అవుతున్న తొలి పాకిస్థాన్ మూవీ ఇదే.. రూ.100 కోట్ల కలెక్షన్లు..

Pakistan Movie: పాకిస్థాన్ సినిమాలు ఇక్కడ రిలీజ్ అవడం, అక్కడి నటీనటులు ఇక్కడ నటించడం మానేసి చాలా ఏళ్లే అవుతోంది. అయితే ఇప్పుడు ఓ పాకిస్థానీ మూవీ ఇండియాలో రిలీజ్ అవుతోంది. అది కూడా పంజాబ్‌లో కావడం విశేషం. ఆ దేశంలో రెండేళ్లుగా సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా కోసం ఇక్కడి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ రిలీజ్

ఇండియాలో పదేళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న పాకిస్థానీ మూవీ ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్. ఆ దేశానికి చెందిన టాప్ స్టార్లు ఫవద్ ఖాన్, మహీరా ఖాన్ నటించిన ఈ మూవీ 2022లో అక్కడి రిలీజైంది.

ఇప్పుడు మన దేశంలోని పంజాబ్ లో అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు రిలీజ్ కు సిద్ధమవడం గమనార్హం. ఈ విషయాన్ని ఆ మూవీ డైరెక్టర్ బిలాల్ లాషారీతోపాటు మహీరా కూడా కన్ఫమ్ చేశారు.

"ఇండియాలోని పంజాబ్ లో అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రెండేళ్లు దాటినా పాకిస్థాన్ లో ఇప్పటికీ వీకెండ్స్ లో హౌజ్ ఫుల్ అవుతోంది. ఈ ప్రేమ కథను ఇండియాలోని పంజాబీ ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారో చూసేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అనే క్యాప్షన్ తో బిలాల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ మూవీ రిలీజ్ విషయాన్ని వెల్లడించాడు. అటు మహీరా ఖాన్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో మూవీ పోస్టర్ పోస్ట్ చేస్తూ.. లెట్స్ గో అనే క్యాప్షన్ ఉంచింది.

పదేళ్ల తర్వాత ఓ పాకిస్థానీ మూవీ

ఇండియాలో ఓ పాకిస్థానీ మూవీ రిలీజ్ అవక పదేళ్లకుపైనే అయింది. ముంబై పేలుళ్లు, పఠాన్ కోట్, ఉరి దాడుల తర్వాత పాకిస్థాన్ సినిమాలు ఇక్కడ రిలీజ్ కావడం లేదు. అక్కడి నటీనటులు కూడా భారతీయ సినిమాల్లో నటించకుండా ప్రభుత్వం నిషేధం విధించింది.

ఈ ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ మూవీలో నటించిన ఫవద్ ఖాన్, మహీరా ఖాన్ కూడా గతంలో బాలీవుడ్ సినిమాల్లో నటించారు. యే దిల్ మై ముష్కిల్, ఖూబ్‌సూరత్ లాంటి సినిమాల్లో ఫవద్ కనిపించగా.. షారుక్ ఖాన్ తో కలిసి రయీస్ మూవీలో నటించింది మహీరా ఖాన్.

ఇక ఇప్పుడు రాబోతున్న ఈ ది లెజెండ్ ఆప్ మౌలా జాట్ మూవీ.. పాకిస్థానీ క్లాసిక్ మూవీ మౌలా జాట్ కు రీమేక్ కావడం విశేషం. నూరి నట్ అనే ఓ గ్యాంగ్ లీడర్, మౌలా జాట్ మధ్య జరిగే ఫైటే ఈ మూవీ కథ. నూరి నట్ పాత్రలో హంజా అలీ అబ్బాసీ నటించగా.. మౌలా జాట్ గా ఫవద్ ఖాన్ కనిపించాడు.

పాకిస్థాన్ లో ఈ సినిమా రూ.100 కోట్లకుపైగానే వసూలు చేసింది. రెండేళ్లు దాటినా ఆ సినిమా ఇప్పటికీ అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. మరి ఇండియాలో పంజాబీ ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.