OTT Tamil Thriller Movie: తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ తమిళ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో టాప్ రేటింగ్
OTT Tamil Thriller Movie: ఓ తమిళ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన నెలన్నర తర్వాత డిజిటల్ ప్రీమియర్ అవుతున్న ఈ సినిమాకు ఐఎండీబీలో టాప్ రేటింగ్ ఉండటం విశేషం.
OTT Tamil Thriller Movie: ఓటీటీలోకి మరో తమిళ థ్రిల్లర్ మూవీ తెలుగు, హిందీల్లోనూ వచ్చింది. ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పేరు పోగుమిదం వేగు తూరమిళ్లై. ఐఎండీబీలో ఏకంగా 9.6 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సూపర్ హిట్ సినిమా.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది. మైఖేల్ కే రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
పోగుమిదం వేగు తూరమిళ్లై ఓటీటీ స్ట్రీమింగ్
పోగుమిదం వేగు తూరమిళ్లై.. అంటే గమ్యం మరెంతో దూరంలో లేదు అని అర్థం. మూవీ స్టోరీకి సరిపోయే టైటిల్ ఇది. ఈ సినిమా ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజై పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. ఇప్పుడు సుమారు నెలన్నర రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతోపాటు తెలుగు, హిందీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 1100 మందికిపైగా రేటింగ్స్ ఇవ్వగా.. ఏకంగా 9.6 రేటింగ్ సొంతం చేసుకున్న సినిమా ఇది. అంటే మెజార్టీ ప్రేక్షకులకు తెగ నచ్చేసిందని అర్థం. అలాంటి సినిమా మరో రెండు భాషల్లోనూ రావడంతో ఓటీటీలో ఈ పోగుమిదం వేగు తూరమిళ్లై మూవీకి మరింత ఆదరణ లభించడం ఖాయంగా కనిపిస్తోంది.
అసలేంటీ మూవీ స్టోరీ?
పోగుమిదం వేగు తూరమిళ్లై మూవీ ఓ మార్చురీ వ్యాన్ డ్రైవర్, అతడు చెన్నై నుంచి తిరునల్వేలికి తీసుకెళ్లే మృతదేహం, దారిలో లిఫ్ట్ అడిగి ఎక్కే మరో వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఓవైపు పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను ఇంటి దగ్గరే వదిలేసి ఆ మృతదేహాన్ని తీసుకొని బయలుదేరిని సదరు వ్యాన్ డ్రైవర్ కు మార్గం మధ్యలో ఎలా సవాళ్లు ఎదురయ్యాయి?
కనిపించకుండా పోయిన మృతదేహాన్ని అతడు తిరిగి పొందగలడా? లిఫ్ట్ అడిగి వ్యాన్ లో ఎక్కిన వ్యక్తి ఈ కథలో తీసుకొచ్చిన మలుపు ఏంటి అన్నది ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీలో చూడొచ్చు. ఓ ఎక్సైటింగ్ రోడ్ ట్రిప్ మూవీ చూడాలనుకునే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. తెలుగులోనూ అందుబాటులో ఉండటంతో హాయిగా చూసేయొచ్చు.
తెలుగులో వస్తున్న మరో తమిళ వెబ్ సిరీస్
ఇక మరో తమిళ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా తెలుగులోకి రాబోతోంది. ఈ సిరీస్ పేరు స్నేక్స్ అండ్ ల్యాడర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రానున్న ఈ సిరీస్ అక్టోబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్ తమిళంతోపాటు మరో నాలుగు భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రైమ్ వీడియో వెల్లడించింది.
ఊహించని ట్విస్టులతో ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఈ ఏడాది మార్చిలో ప్రైమ్ వీడియో ఈ సిరీస్ అనౌన్స్ చేయగా.. మరో పది రోజుల్లో ఓటీటీలోకి అడుగు పెట్టనుంది. ఈ వెబ్ సిరీస్ కు భరత్ మురళీధరన్, అశోక్ వీరప్పన్, కమలా అల్కెమిస్ డైరెక్ట్ చేస్తున్నారు.
నలుగురు డేరింగ్ పిల్లల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఓ ప్రమాదాన్ని దాచి పెట్టడానికి వారు చేసిన ప్రయత్నం మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పోలీసులు, దొంగలు వారి వెంట పడతారు. వాళ్ల నుంచి ఈ నలుగురు పిల్లలు ఎలా తప్పించుకుంటారు? చివరికి వాళ్ల జీవితాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి? అన్నది ఈ స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వెబ్ సిరీస్ లో చూడొచ్చు.