OTT Suspense Thriller Movie: ఓటీటీలోకి తొమ్మిది నెలల తర్వాత వచ్చిన హిట్ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ..
OTT Suspense Thriller Movie: ఓటీటీలోకి ఓ కన్నడ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 9 నెలల తర్వాత రావడం విశేషం. ఓ దట్టమైన అడవిలో ట్రెక్కింగ్ కు వెళ్లిన ఓ జంట చుట్టూ తిరిగే ఈ స్టోరీ ఎంతో ఉత్కంఠ రేపుతుంది.
OTT Suspense Thriller Movie: ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. 9 నెలల తర్వాత ఇప్పుడు ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. అయితే ఇప్పటికీ సబ్‌స్క్రైబర్లందరికీ ఫ్రీగా కాకుండా రెంట్ విధానంలో ఈ సినిమా అందుబాటులోకి రావడం విశేషం.
క్లాంతా ఓటీటీ స్ట్రీమింగ్
మనం చెప్పుకుంటున్న కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు క్లాంతా (Klaantha). ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఈ సినిమా చూడాలంటే రూ.99 రెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ ఏడాది జనవరి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ డిజిటల్ ప్రీమియర్ కోసం మరీ ఇన్నాళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఫ్రీగా స్ట్రీమింగ్ కు తీసుకురాకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించేదే.
క్లాంతా మూవీ స్టోరీ ఏంటంటే?
క్లాంతా ఓ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ పేరుకు అర్థం అలసిపోవడం అని. ఓ వీకెండ్ ఓ జంట ట్రెక్కింగ్ అంటూ ఓ దట్టమైన అడవిలోకి వెళ్తుంది. అదే వాళ్లను ఊహించని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఆ అడవిలోని మిస్టరీ ఏంటి? అది ఆ జంటను ఎలాంటి ప్రమాదంలోకి తీసుకెళ్లిందన్నది ఈ క్లాంతా మూవీ స్టోరీ.
తమ ఇళ్లలో చెప్పకుండా ఓ అమ్మాయి, అబ్బాయి వీకెండ్ టూర్ అంటూ ఓ అడవిలోకి వెళ్తారు. అక్కడ అనుకోకుండా ఓ గ్యాంగ్ బారిన పడతారు. మొదట్లో నెమ్మదిగా సాగే కథనం.. తర్వాత వేగం పుంజుకుంటుంది. మూవీ సెకండాఫ్ అంతా ఓ మంచి థ్రిల్లర్ మూవీని తలపిస్తుంది.
సుమారు 40 రోజుల పాటు అడవిలోనే ఈ సినిమాను చిత్రీకరించడం విశేషం. వైభవ్ ప్రశాంత్ డైరెక్ట్ చేసిన క్లాంతా మూవీలో విగ్నేష్, సంగీతా భట్, శోభరాజ్, వీణా సుందర్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా జనవరి 19న థియేటర్లలో రిలీజైంది. అయితే మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. మొత్తానికి 9 నెలల తర్వాత ఇప్పుడు ప్రైమ్ వీడియోలోకి ఈ సినిమా అడుగుపెట్టింది.