OTT Releases: ఈ వీకెండ్ పండగ చేసుకోండి.. ఓటీటీల్లో ఈ సినిమాలు, సిరీస్‌లు చూడండి-ott releases this week end as you must not miss these movies and series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Ott Releases This Week End As You Must Not Miss These Movies And Series

OTT Releases: ఈ వీకెండ్ పండగ చేసుకోండి.. ఓటీటీల్లో ఈ సినిమాలు, సిరీస్‌లు చూడండి

Hari Prasad S HT Telugu
Jun 10, 2023 08:20 AM IST

OTT Releases: ఈ వీకెండ్ పండగ చేసుకోండి. ఓటీటీల్లోకి వచ్చిన ఈ సినిమాలు, సిరీస్‌లు చూడండి. సమ్మర్ హాలీడేస్ లో లాస్ట్ వీకెండ్ కావడంతో పిల్లలతో కలిసి ఇంట్లోనే వీటితో టైంపాస్ చేసేయొచ్చు.

ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన అవతార్ 2, 2018 సినిమాలు
ఈ వీకెండ్ ఓటీటీల్లోకి వచ్చిన అవతార్ 2, 2018 సినిమాలు

OTT Releases: ఈ వీకెండ్ టైంపాస్ చేయడానికి ఓటీటీల్లోకి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. రెండు రోజుల పాటు బింజ్ వాచ్ చేసేలా చాలా కంటెంట్ అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మలయాళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా అన్నింటి నుంచీ మంచి కంటెంట్ ఈ వారం రిలీజైంది. వీటిలో అవతార్ 2తోపాటు కస్టడీ, బ్లడీ డాడీ, 2018లాంటి సినిమాలు కూడా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

అవతార్ ది వే ఆఫ్ వాటర్ - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ ఓటీటీలో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఈ వీకెండ్ మంచి టైంపాస్ మూవీ ఇది. ఏకంగా 3 గంటల 12 నిమిషాలపాటు జేమ్స్ కామెరాన్ విజువల్ వండర్ ను ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఉంది. ఇంగ్లిష్ తోపాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

కస్టడీ - అమెజాన్ ప్రైమ్ వీడియో

బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన నాగ చైతన్య కస్టడీ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (జూన్ 9) నుంచి ఈ సినిమా సోనీలివ్ లో స్ట్రీమ్ అవుతోంది.

2018 - సోనీలివ్

ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ 2018. మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పుడీ సినిమా సోనీలివ్ ఓటీటీలో మలయాళంతోపాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

బ్లడీ డాడీ - జియో సినిమా

బాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వారి కోసం జియో సినిమాలో షాహిద్ కపూర్ నటించిన బ్లడీ డాడీ అందుబాటులో ఉంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని జియో సినిమాలో ఫ్రీగా చూసేయొచ్చు.

నెవర్ హావ్ ఐ ఎవర్ 4 - నెట్‌ఫ్లిక్స్

అమెరికాలో ఉండే ఓ భారత సంతతి టీనేజ్ అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ నెవర్ హావ్ ఐ ఎవర్. ఈ సిరీస్ నాలుగో సీజన్ తాజాగా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. మీరు గత సీజన్లు చూసి ఉంటే ఈ నాలుగో సీజన్ కూడా చూసి ఎంజాయ్ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.