Custody, #Mentoo OTT Streaming: నేడు ఓటీటీల్లోకి వచ్చేసిన కస్టడీ, మెన్‍టూ సినిమాలు.. ఏ ప్లాట్‍ఫామ్‍ల్లో అంటే!-custody movie streaming begins today in amazon prime video mentoo arrives to aha ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Custody Movie Streaming Begins Today In Amazon Prime Video Mentoo Arrives To Aha

Custody, #Mentoo OTT Streaming: నేడు ఓటీటీల్లోకి వచ్చేసిన కస్టడీ, మెన్‍టూ సినిమాలు.. ఏ ప్లాట్‍ఫామ్‍ల్లో అంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 09, 2023 01:41 PM IST

Custody, Mentoo OTT Streaming: కస్టడీ, #మెన్‍టూ సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేశాయి. ఈ మూవీల స్ట్రీమింగ్ నేడు మొదలైంది.

Custody, #Mentoo OTT Streaming: నేడు ఓటీటీల్లోకి వచ్చేసిన కస్టడీ, మెన్‍టూ సినిమాలు
Custody, #Mentoo OTT Streaming: నేడు ఓటీటీల్లోకి వచ్చేసిన కస్టడీ, మెన్‍టూ సినిమాలు

Custody, Mentoo OTT Streaming: ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి నేడు (జూన్ 9) రెండు తెలుగు సినిమాలు వచ్చేశాయి. నాగ చైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ నేడు మొదలైంది. నాగ చైతన్య పోలీస్‍గా నటించిన ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో ముందుగానే ఓటీటీకి వచ్చింది. ఇక ఆఫీస్‍ల్లో కొందరు పురుషులు పడే కష్టాలను చూపించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ #మెన్‍టూ మూవీ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ రెండు సినిమాలు ఓటీటీల్లో ఒకే రోజు అడుగుపెట్టాయి. ఏ సినిమా ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమ్ అవుతోందంటే..

ట్రెండింగ్ వార్తలు

అమెజాన్ ప్రైమ్ వీడియోలో కస్టడీ

నాగ చైతన్య హీరో పాత్ర పోషించిన సినిమా ‘కస్టడీ’.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమ్ అవుతోంది. నేడే (జూన్ 9) ఈ మూవీ ఈ ఓటీటీలో అడుగుపెట్టింది. మే 12న థియేటర్లలో విడుదలైన కస్టడీ హిట్ కాలేకపోయింది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. కృతి శెట్టి హీరోయిన్‍గా నటించింది. సీనియర్ హీరో అరవింద స్వామి కీలకపాత్ర పోషించాడు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే, క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన కస్టడీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టలేకపోయింది. మరి ఓటీటీలో ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

#మెన్‍టూ ఎక్కడంటే..

డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చిన్న సినిమాగా వచ్చిన #మెన్‍టూ థియేటర్లలో మోస్తరుగా ఆడింది. నేడు (జూన్ 9) ఓటీటీ ప్లామ్‍ఫామ్ ‘ఆహా’(Aha)లో ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. మే 26న ఈ మూవీ థియేటర్లలో విడుదల కాగా.. రెండు వారాల్లోనే ఆహా ఓటీటీలోకి వచ్చింది మెన్‍టూ. నరేశ్ అగస్త్య, బ్రహ్మాజీ, వైవా హర్ష, సుదర్శన్, రియా సుమన్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఆఫీస్‍లో కొందరు పురుషుల ఎదుర్కొనే కష్టాలు ప్రధానాంశంగా ఈ చిత్రం వచ్చింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. #మెన్‍టూ చిత్రానికి శ్రీకాంత్ జీ రెడ్డి దర్శకత్వం వహించారు. మౌర్య సిద్ధవర్మన్ నిర్మాతగా ఉన్నారు.

కేరళ వరదల నేపథ్యంలో రూపొంది సూపర్ హిట్ అయిన 2018 సినిమా కూడా సోనీ లివ్‍లో ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇక జేమ్స్ కామెరూన్ అద్భుత కళాఖండం అవతార్-2 డిస్నీ+ హాట్‍స్టార్‌లో యూజర్లకు అందుబాటులో వచ్చింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.