Aryan Khan: రూ.120 కోట్ల ఆఫర్‌నూ వద్దనుకున్నాడు.. షారుక్ ఖాన్‌కు నో చెప్పిన కొడుకు ఆర్యన్!
Aryan Khan: రూ.120 కోట్ల ఆఫర్‌నూ వద్దనుకున్నాడు.. షారుక్ ఖాన్‌కు నో చెప్పిన కొడుకు ఆర్యన్. ఇప్పుడు బాలీవుడ్ లో ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్యన్ ఓ వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.
Aryan Khan: దశాబ్దాలుగా బాలీవుడ్ ను ఏలుతున్న స్టార్ హీరో కొడుకు.. అతనిలాగే మంచి లుక్స్.. హీరో అవడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి. అయినా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాత్రం డైరెక్టర్ అవుతున్నాడు. ఓ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు తన ఈ తొలి వెబ్ సిరీస్ లో షారుక్ స్పెషల్ అప్పియరెన్స్ కు కూడా నో చెప్పాడని, తన వెబ్ సిరీస్ కోసం రూ.120 కోట్లు ఆఫర్ చేసిన ఓటీటీనీ దూరం పెట్టాడని వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.
షారుక్ ఖాన్‌కు నో
ఓ స్టార్ హీరో కొడుకు హీరో అయినా, డైరెక్టర్ అయినా తన తొలి సినిమాలోనో తర్వాతి సినిమాలోనూ ఆ హీరోని అతిథిపాత్రలో చూపించి క్యాష్ చేసుకోవాలని అనుకుంటారు. చాన్నాళ్లుగా ఏ ఇండస్ట్రీలో అయినా ఇదే ధోరణి కనిపిస్తోంది. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం తన తండ్రి షారుక్ ఇమేజ్ వాడుకోవడానికి నో చెప్పాడు. తన తొలి వెబ్ సిరీస్ లో షారుక్ నటించడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఆర్యన్ నో చెప్పాడట.
స్టార్ హీరో కొడుకుగా ఇండస్ట్రీలో ఆ హోదాను ఎంజాయ్ చేస్తున్నానన్న ఫీలింగ్ అభిమానుల్లో రాకూడదన్న ఉద్దేశంతోనే ఆర్యన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆర్యన్ తాను నటనను కాకుండా డైరెక్షన్ ను కెరీర్ గా ఎంచుకున్నప్పటి నుంచీ తన తొలి వెబ్ సిరీస్ లో నటించడానికి షారుక్ ఆసక్తి చూపాడని, అయితే ఆర్యన్ మాత్రం అందుకు తిరస్కరించాడని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
రూ.120 కోట్లూ వద్దనుకున్నాడా?
మరోవైపు ఆర్యన్ కు సంబంధించే మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. తన డైరెక్షన్ లో వస్తున్న తొలి వెబ్ సిరీస్ హక్కుల కోసం ఓ ప్రముఖ ఓటీటీ అతనికి రూ.120 కోట్లు ఆఫర్ చేసిందట. కానీ ఆర్యన్ మాత్రం ఆ ఆఫర్ కు నో చెప్పాడు. సిరీస్ షూటింగ్, ఎడిటింగ్ పూర్తయినంత వరకూ ఇలాంటి ఒప్పందాలు వద్దని ఆర్యన్ అనుకోవడమే దీనికి కారణం.
పెద్ద హీరోలు కూడా తొలి సీజన్ ముగియకముందే తర్వాతి సీజన్ల కోసం డీల్ కుదుర్చుకుంటున్నారని, ఆర్యన్ మాత్రం అంత పెద్ద ఆఫర్ ను తిరస్కరించడం నిజంగా విశేషమనీ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ వెబ్ సిరీస్ ను షారుక్, గౌరీ దంపతులు నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉండనున్నాయి.
సంబంధిత కథనం