Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టిన టాలీవుడ్ సెలిబ్రిటీలు - కనిపించని మెగా యంగ్ హీరోలు
Allu Arjun: జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ను పరామర్శించేందుక అతడి ఇంటికి టాలీవుడ్ సెలబ్రిటీలు క్యూ కడుతోన్నారు. చిరంజీవి సతీమణి సురేఖ ఒంటరిగా అల్లు అర్జున్ ఇంటికి రావడం ఆసక్తికరంగా మారింది. మెగా హీరోలు బన్నీ ఇంట్లో కనిపించకపోవడంపై నెటిజన్లు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ శనివారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. ఈ కేసులో అల్లు అర్జున్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు అతడికి రిమాండ్ విధించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యాడు.
రాత్రంతా జైలులోనే...
శుక్రవారం సాయంత్రమే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లాల్సింది. కానీ బెయిల్ పేపర్స్‌లో కొన్ని పొరపాట్ల కారణంగా అతడు శుక్రవారం రాత్రి జైలులోనే గడపాల్సివచ్చింది. చంచల్‌గూడ జైలు నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నాడు అల్లు అర్జున్. అక్కడి నుంచి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌ను చూడగానే అతడి భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయ్యింది కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
విజయ్ దేవరకొండ, నాగచైతన్య...
కాగా జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు అతడి ఇంటికి టాలీవుడ్ సెలబ్రిటీలు క్యూ కట్టారు. విజయ్ దేవరకొండ, నాగచైతన్య, రానా, వంశీపైడిపల్లి, దిల్‌రాజు, కొరటాల శివ, హరీష్ శంకర్‌తో పాటు పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు విజయ్ దేవరకొండ ఇంటికి చేరుకున్నారు.బన్నీతో ముచ్చటించారు.
చిరంజీవి సతీమణి ఒక్కరే...
చిరంజీవి సతీమణి సురేఖ ఒక్కరే బన్నీ ఇంటికి రావడం ఆసక్తికరంగా మారింది. శుక్రవారం రోజు చిరంజీవి, సురేఖతో పాటు నాగబాబు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. శనివారం రోజు మాత్రం సురేఖ ఒంటరిగా బన్నీ ఇంటికి వచ్చారు. మేనల్లుడిని హత్తుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
మెగా యంగ్ హీరోలు...
చిరంజీవి, నాగబాబు మినహా మెగా హీరోలు ఎవరూ అల్లు అర్జున్ ఇంటికి రాకపోవడం ఆసక్తికరంగా మారింది. రామ్‌చరణ్‌తో పాటు మెగా యంగ్ హీరోలు సైతం అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా ఎలాంటి ట్వీట్స్ చేయలేదు. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో..జైలు వద్ద కనిపించలేదు. రిలీజై బన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మెగా హీరోలు ఎవరు కనిపించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతోన్నాయి.
మెగా ఫ్యామిలీతో విభేదాలు…
మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కు విభేదాలు ఉన్నట్లుగా చాలా కాలంగా వార్తలు వినిపిస్తోన్నాయి. బన్నీ అరెస్ట్ తర్వాత కూడా అతడి ఇంటికి మెగా హీరోలు రాకపోవడం, సపోర్ట్‌గా నిలవకపోవడం చూస్తుంటే విభేదాలు నిజమేనని ప్రచారం జరుగుతోంది. బన్నీ గురించి ఎలాంటి ట్వీట్ చేయని రామ్‌చరణ్...రానా పుట్టినరోజు సందర్భంగా అతడికి విషెస్ చెప్పడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. గొడవల్ని పక్కనపెట్టి అల్లు అర్జున్ ఇంటికి మెగా హీరోలు వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తోన్నారు. మెగా హీరోల గురించి నెటిజన్లు చేసిన ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.