Shah Rukh Khan Wankhede chat : ‘ప్లీజ్.. నా ఆర్యన్‌ను వదిలెయ్’- పాపం షారుఖ్ ఖాన్!
Shah Rukh Khan chat with Wankhede : ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో సమీర్ వాంఖడేతో షారుఖ్ ఖాన్ ఛాట్ చేశారంటూ నివేదికలు వస్తున్నాయి. తన కుమారుడిని విడిచిపెట్టమని షారుఖ్ ఖాన్ కోరినట్టు తెలుస్తోంది.
Shah Rukh Khan Sameer Wankhede : 2021 డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత.. ముంబైలోని అప్పటి ఎన్సీబీ (నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడేతో ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఛాట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తన కుమారుడిని విడిచిపెట్టమని సమీర్ వాంఖడేను షారుఖ్ వేడుకున్నట్టు ఈ ఛాట్స్ చెబుతున్నాయి.
'ప్లీజ్.. ప్లీజ్.. నా ఆర్యన్‌ను వదిలెయ్..!'
సమీర్ వాంఖడేకు షారుఖ్ ఖాన్ చేసిన మెసేజ్‌లు ఇవేనని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
Sameer Wankhede chat : "మనమిద్దరం గర్వపడే స్థాయికి ఆర్యన్ ఖాన్ చేరుకుంటాడు. ఈ ఘటన (డ్రగ్స్ కేసులో అరెస్ట్).. ఆర్యన్ జీవితంలోనే కీలక మలుపుగా ఉంటుంది. మంచిగా ఉపయోగపడుతుంది"
"గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు వచ్చి నీకు నేను హగ్ ఇస్తాను. నీకు ఎప్పుడు కుదురుతుందో చెప్పు. నీ మీద నాకు ఎప్పటి నుంచో గౌరవం ఉంది. ఇప్పుడు ఆ గౌరవం చాలా రెట్లు పెరిగింది."
"నీ ఇంటిగ్రిటీ కోల్పోకుండా.. ఏ విధంగా సాయం చేసినా నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను."
Shah Rukh Khan chat with Wankhede : "ఈ ఘటనలో ఆర్యన్ పాత్ర చాలా చిన్నది. ఆ విషయం నీకు కూడా తెలుసు. అతనికి సంస్కరణ తెలియాలి. తాజా పరిస్థితులతో తెలిసి వచ్చింది. ఆర్యన్‌ను గొప్ప మనిషిగా తీర్చిదిద్దేందుకు నేను హామీనిచ్చాను. చేసి చూపిస్తాను."
"ఐ బెగ్ యూ. నీ మనుషులను కాస్త నెమ్మదించమను. ఇలా చేస్తే.. నీ వెన్నంటే నేను ఉంటాను. మంచి చేయాలన్న నీ లక్ష్యానికి సాయం చేస్తాను. ఇది నా హామీ. నా హామీని నేను నెరవేర్చుకుంటానని నీకు తెలుసు."
"నా ఆర్యన్ కాస్త దారితప్పాడు! నా మీద, నా కుటుంబం మీద కాస్త జాలి చూపించు. దారితప్పినంత మాత్రాన కఠినమైన నేరాలు చేసినట్టు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఆర్యన్‌కు లేదు. నీకు కూడా ఈ విషయం తెలుసు. మంచి హృదయంతో ఆలోచించు."
Shah Rukh Khan Sameer Wankhede : "ఈ రోజు మా మనసులను ముక్కలు చేయకు. ప్లీజ్. ఇది ఒక తండ్రి.. మరో తండ్రిని అడుగుతున్న రిక్వెస్ట్ అనుకో. నీలాగే ఒక తండ్రిగా నేను నా బిడ్డలను ప్రేమిస్తున్నాను. బయట ఎన్ని పరిస్థితులు ఉన్న ఈ తండ్రి భావనలను మనం విడిచిపెట్టకూడు."
"ఈ పూర్తి వ్యవహారంపై నా ప్రవర్తనను నువ్వు గుర్తించే ఉంటావు. నువ్వు చేసే ఏ పనిని నేను వ్యతిరేకించను. 'ఆర్యన్‌ను నా సొంత మనిషిగా భావిస్తున్నా' అని నువ్వు చెప్పిన మాటలను నేను నమ్ముతున్నాను. ఆర్యన్‌ను మంచి మనిషి చేయాలని ఉంది."
Aryan Khan drugs case : "నేను మీడియా ముందుకు వెళ్లలేదు. నా కుమారుడికి సాయం చేసే విధంగా నేను ఏం చేయలేదు. నేను ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు. నీ మంచితనంపై నమ్మకం పెట్టుకున్నాను. నన్ను ఓ తండ్రిగా తలదించుకునేలా చేయకు. ప్లీజ్. ప్లీజ్."
ఈ ఛాట్‌కు సంబంధించిన ఓ నివేదిక ఆన్లైన్లో వైరల్‌గా మారింది. ఇందులో ఎంత నిజం ఉందో హెచ్‌టీ తెలుగు వెరిఫై చేయలేకపోయింది.
ఆర్యన్ ఖాన్ కేసు..
Aryan Khan chat : క్రూజ్ పార్టీలో డ్రగ్స్ దొరికిన కేసులో 2021 అక్టోబర్‌లో ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది. దాదాపు నెల రోజుల పాటు అతను ముంబై జైలులో ఉన్నాడు. ఆర్యన్ ఖాన్‌పై వేసిన ఆరోపణలను ఎన్సీబీ రుజువు చేయలేకపోవడంతో.. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ వచ్చింది.
ఆర్యన్ ఖాన్‌కు క్లిన్ చిట్ ఇస్తున్నట్టు గతేడాది మేలో ఎన్సీబీ ప్రకటించింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వాడలేదని పేర్కొంది. ప్రాథమిక దర్యాప్తులో లోపాలు ఉన్నాయని వివరించింది.
వాంఖడేపై ఆరోపణలు..
ఆర్యన్ ఖాన్ విషయంలో.. షారుఖ్ ఖాన్‌ను సమీర్ వాంఖడే బెదిరించారని ఆరోపణలు వస్తున్నాయి. ఆర్యన్ ఖాన్‌ను రక్షించేందుకు షారుఖ్‌ను సమీర్ రూ. 25కోట్లు అడిగారన్నది ప్రధాన ఆరోపణ. తాను ఎలాంటి తప్పు చేయలేదని సమీర్ వాంఖడే చెబుతున్నారు.
సంబంధిత కథనం