Youtube Web Series: యూట్యూబ్‌లో ఫ్రీగా చూడగలిగే టాప్ వెబ్ సిరీస్ ఇవే
Youtube Web Series: యూట్యూబ్‌లో ఫ్రీగా చూడగలిగే టాప్ వెబ్ సిరీస్ ఇవే. వివిధ ఓటీటీలు, టాప్ యూట్యూబ్ ఛానెల్స్ కు చెందిన బెస్ట్ వెబ్ సిరీస్ ఇందులో అందుబాటులో ఉన్న విషయం మీకు తెలుసా?
Youtube Web Series: ఓటీటీలు వచ్చిన తర్వాత వెబ్ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. సినిమాలను తలదన్నేలా 5 నుంచి 10 ఎపిసోడ్ల పాటు ఈ సిరీస్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5లాంటి ఓటీటీల్లో ఇంగ్లిష్, హిందీ, తెలుగుతోపాటు ఇతర భాషల్లో ఎన్నో వెబ్ సిరీస్ ఉన్నాయి.
అయితే వీటిని చూడాలంటే ఆయా ఓటీటీలకు సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. కానీ అది అందరికీ సాధ్యం కాని పని. ఈ టాప్ ఓటీటీలు అన్నీ కావాలంటే నెలకు కనీసం రూ.1000 అయినా ఖర్చు పెట్టాలి. అలా కాకుండా మీ మొబైల్ తోపాటు ల్యాప్‌టాప్, ట్యాబ్, స్మార్ట్ టీవీల్లో సులువుగా అందుబాటులో ఉండే యూట్యూబ్ లోనూ కొన్ని వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వీటిని ఫ్రీగా చూడొచ్చు.
టీవీఎఫ్ ప్లే, డైస్ మీడియా, జూమ్ టీవీ, వై ఫిల్మ్స్, బిందాస్ లాంటి యూట్యూబ్ ఛానెల్స్ కు చెందిన వెబ్ సిరీస్ లను ఫ్రీగా చూసే వీలుంది. వీటిలోనూ ఎన్నో మంచి సిరీస్ లు ఉన్నాయి. ముఖ్యంగా స్టూడెంట్స్, యువతను ఆకట్టుకునే సిరీస్ లు ఇవి. ఇంతటి క్వాలిటీ కంటెంట్ ను ఉచితంగా అందిస్తుంటే ఎవరు మాత్రం చూడరు చెప్పండి. ఆ వెబ్ సిరీస్ లిస్ట్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి.
యూట్యూబ్ వెబ్ సిరీస్ ఇవే
సందీప్ భయ్యా - టీవీఎఫ్ ప్లే
పర్మనెంట్ రూమ్మేట్స్ - టీవీఎఫ్ ప్లే
ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ - డైస్ మీడియా
సోల్‌మేట్స్ - జూమ్ టీవీ
ఆస్పిరెంట్స్ - టీవీఎఫ్ ప్లే
లిటిల్ థింగ్స్ - డైస్ మీడియా
గర్ల్ ఇన్ ద సిటీ - బిందాస్
లేడీస్ రూమ్ - వై ఫిల్మ్స్
లవ్ బైట్స్ - సోనీ లివ్
అలీషా - బ్లష్
ఫ్లేమ్స్ - ది టైమ్ లైనర్స్
అడల్టింగ్ - డైస్ మీడియా
కోటా ఫ్యాక్టరీ - టీవీఎఫ్ ప్లే
పిచర్స్ - టీవీఎఫ్ ప్లే
ఆపరేషన్ ఎంబీబీఎస్ - డైస్ మీడియా
ట్రిప్లింగ్ - టీవీఎఫ్ ప్లే
సంబంధిత కథనం
టాపిక్