OTT Horror Comedy: ఓటీటీలోకి ముందే వచ్చేస్తున్న రూ.400 కోట్ల బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ!
OTT Horror Comedy: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ ఊహించినదాని కంటే ముందే వచ్చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర రూ.400 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ.. నెట్‌ఫ్లిక్స్ లోకి రానుంది.
OTT Horror Comedy: ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో నాలుగో స్థానంలో నిలిచిన హారర్ కామెడీ మూవీ భూల్ భులయ్యా 3. కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, తృప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ఈ నెలలోనే ఓటీటీలోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భూల్ భులయ్యా 3 ఓటీటీ రిలీజ్ డేట్
భూల్ భులయ్యా మూవీ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మూడో సినిమా భూల్ భులయ్యా 3. ఈ సినిమా నవంబర్ 1న థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ మూవీ వచ్చే ఏడాదే ఓటీటీలోకి వస్తుందని ముందుగా భావించారు. కానీ తాజాగా ఫిల్మీబీట్ లో వచ్చిన రిపోర్టు ప్రకారం.. డిసెంబర్ 27 నుంచే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు పెద్దగా పాజిటివ్ రివ్యూలు రాకపోయినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం రూ.420 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం. గతంలో వచ్చిన రెండు సినిమాల కంటే కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో ఇండియన్ సినిమాగా నిలిచింది.
భూల్ భులయ్యా మూవీ గురించి..
హారర్ కామెడీ జానర్లో ఈ ఏడాది వచ్చిన చాలా సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. స్త్రీ2, ముంజ్యాలాంటి మూవీస్ అందులో ఉండగా.. భూల్ భులయ్యా 3 కూడా బ్లాక్‌బస్టర్ అయింది. అనీస్ బజ్మీ నటించిన ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, తృప్తి డిమ్రి, మాధురీ దీక్షిత్ లాంటి వాళ్లు నటించారు.
గతంలో వచ్చిన రెండు సినిమాల్లో రూహ్ బాబా, మంజూలిక పాత్రల్లో మరోసారి కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్ జీవించేశారు. ఈ మూవీ హారర్ తోపాటు కామెడీని కూడా మిక్స్ చేసి ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 27 నుంచి మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.