OTT Comedy Movie: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-ott comedy movie rao ramesh starrer maruthi nagar subramanyam to stream on aha video ott on september 20th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Comedy Movie: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Comedy Movie: నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Sep 13, 2024 05:58 PM IST

OTT Comedy Movie: ఓటీటీలో మరో తెలుగు సూపర్ హిట్ కామెడీ మూవీ వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే రావు రమేష్ నటించిన ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కావడం విశేషం. ఈ మధ్యే మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అనౌన్స్ చేయగా.. తాజాగా శుక్రవారం (సెప్టెంబర్ 13) స్ట్రీమింగ్ డేట్ వెల్లడించారు.

నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తెలుగు కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Comedy Movie: ఓటీటీలోకి గత నెలలోనే థియేటర్లలో రిలీజైన మరో సినిమా వస్తోంది. ప్రముఖ టాలీవుడ్ నటుడు రావు రమేష్ లీడ్ రోల్లో నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలో అడుగు పెడుతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం (సెప్టెంబర్ 13) ఆహా వీడియో వెల్లడించింది.

మారుతీనగర్ సుబ్రమణ్యం ఓటీటీ రిలీజ్ డేట్

రావు రమేష్ నటించిన మారుతీనగర్ సుబ్రమణ్యం మూవీ ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ కామెడీ ఫ్యామిలీ డ్రామాను సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా వీడియో వెల్లడించింది. తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.

"మీకు కావాల్సిన నవ్వుల థెరపీ మా దగ్గర ఉంది. ఈ ఏడాది అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్.. మారుతీనగర్ సుబ్రమణ్యం ఆహాలో 20వ తేదీన ప్రీమియర్ కానుంది" అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.

మారుతీనగర్ సుబ్రమణ్యం ఎలా ఉందంటే?

మారుతి నగర్ సుబ్రమ‌ణ్యం ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ. ఫ‌స్ట్ సీన్‌ నుంచి శుభం కార్డు వ‌ర‌కు ఆడియెన్స్‌ను న‌వ్వించ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకొని ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య ఈ మూవీని తెర‌కెక్కించాడు. అందుకు త‌గ్గ‌ట్లే రావు ర‌మేష్, అంకిత్ కొయ్య‌తో పాటు ప్ర‌తి క్యారెక్ట‌ర్ నుంచి ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌.

క‌థ కంటే కామెడీపైనే ద‌ర్శ‌కుడు ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టాడు. అనుకోకుండా అకౌంట్‌లో ల‌క్ష‌లు, కోట్ల‌లో డ‌బ్బులు ప‌డ‌టం, వాటిని జ‌ల్సాల‌కు వాడుకునే వ్య‌క్తులు, ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల‌కు ఏళ్లు ఎదురుచూసే వారి క‌థ‌నాలు త‌ర‌చుగా టీవీల్లో, పేప‌ర్ల‌లో క‌నిపిస్తుంటాయి.

అలాంటి సంఘ‌ట‌న‌ల నుంచే ద‌ర్శ‌కుడు మారుతి నగర్ సుబ్రమ‌ణ్యం క‌థ‌ను రాసుకున్నాడు. ఈ సింపుల్ పాయింట్‌తో రెండున్న‌ర గంట‌లు ఆడియెన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డం అంటే క‌ష్ట‌మే. కానీ ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు.

ఫ‌స్ట్‌హాఫ్ ఫ‌న్‌...

పాతికేళ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సుబ్ర‌హ్మ‌ణ్యం ఇంట్లో భార్య‌, అత్త చేత మాట‌లు ప‌డ‌టం, అత‌డి క‌ష్టాలు, కొడుకు భ్ర‌మ‌ల‌తో ఫ‌స్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగిపోతుంది. ఈ సీన్స్‌లోని సిట్యూవేష‌న‌ల్ కామెడీ వ‌ర్క‌వుట్ అయ్యింది. రావుర‌మేష్‌ కామెడీ టైమింగ్‌, పంచ్‌లు న‌వ్విస్తాయి. సెకండాఫ్‌లోనే ద‌ర్శ‌కుడు అస‌లు క‌థ‌లోకి వెళ్లాడు.

భార్య త‌న అకౌంట్‌లో డ‌బ్బులు వేసింద‌ని తెలియ‌ని సుబ్ర‌హ్మ‌ణ్యం వాటిని ఖ‌ర్చుచేయ‌డం, ఆ డ‌బ్బును కూడ‌బెట్టే ప్ర‌య‌త్నంలో సుబ్ర‌హ్మ‌ణ్యం అర్జున్ త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూ వెళ్లే సీన్స్‌తో ఫ‌న్‌తో పాటు స‌స్పెన్స్ ఉండేలా రాసుకున్నాడు.

మైండ్‌బ్లోయింగ్ అనుకునేలా కాక‌పోయినా చిన్న చిన్న ట్విస్ట్‌ల‌తో కొత్త పాత్ర‌ల్ని స్క్రీన్‌పై తీసుకొస్తూ సెకండాఫ్‌ను న‌డిపించాడు. ఈ క్ర‌మంలో కొన్ని చోట్ల లాజిక‌ల్‌లు మిస్స‌యిన వాటిని కామెడీతో క‌వ‌ర్ చేశారు. ఎమోష‌న‌ల్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేసిన విధానం బాగుంది.

మారుతి నగర్ సుబ్రమ‌ణ్యం సినిమాకు కామెడీనే బ‌లం. కానీ అదే కొన్ని చోట్ల బ‌ల‌హీనంగా మారింది. కామెడీ కోసమే అవ‌స‌రం లేక‌పోయినా ద‌ర్శ‌కుడు కొన్ని పాత్ర‌లు క్రియేట్ చేసిన ఫీలింగ్ క‌లుగుతుంది. ఫ‌న్ విష‌యంలో ఆక‌ట్టుకున్న ద‌ర్శ‌కుడు కీల‌క‌మైన ఎమోష‌న్స్‌లో కొంత త‌డ‌బాటుకు లోన‌య్యాడు.