OTT Bold Movie: ఆ బిడ్డకు ఇద్దరు తండ్రులు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ.. ఇక ఫ్రీగా చూసేయొచ్చు-ott bold movie tripti dimri starrer bad newz to stream on prime video from september 13th for free ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold Movie: ఆ బిడ్డకు ఇద్దరు తండ్రులు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ.. ఇక ఫ్రీగా చూసేయొచ్చు

OTT Bold Movie: ఆ బిడ్డకు ఇద్దరు తండ్రులు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ.. ఇక ఫ్రీగా చూసేయొచ్చు

Hari Prasad S HT Telugu
Sep 11, 2024 09:59 AM IST

OTT Bold Movie: ఓటీటీలోకి ఓ బోల్డ్ మూవీ రాబోతోంది. యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి నటించిన ఈ సినిమా ఇప్పటికే రెంట్ విధానంలో అందుబాటులో ఉండగా.. ఇక నుంచి అందరూ ఫ్రీగా చూసే వీలు కలగనుంది.

ఆ బిడ్డకు ఇద్దరు తండ్రులు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ.. ఇక ఫ్రీగా చూసేయొచ్చు
ఆ బిడ్డకు ఇద్దరు తండ్రులు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యానిమల్ బ్యూటీ బోల్డ్ మూవీ.. ఇక ఫ్రీగా చూసేయొచ్చు

OTT Bold Movie: యానిమల్ మూవీతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్ గా మారిపోయిన తృప్తి డిమ్రి నటించిన మూవీ బ్యాడ్ న్యూస్. ఈ బోల్డ్ మూవీలో తన బిడ్డకు ఇద్దరు తండ్రులంటూ చాలా బోల్డ్ పాత్రలో నటించింది. ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఫ్రీగా సబ్‌స్క్రైబర్లందరూ చూసేయొచ్చు.

బ్యాడ్ న్యూస్ ఓటీటీ రిలీజ్ డేట్

విక్కీ కౌశల్, తృప్తి డిమ్రి, ఆమీ విర్క్ నటించిన మూవీ బ్యాడ్ న్యూస్. జులై 19న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా శుక్రవారం (సెప్టెంబర్ 13) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు రాబోతోంది.

నిజానికి రెండు వారాల నుంచి ఈ సినిమాను రెంట్ విధానంలో అందుబాటులో తీసుకొచ్చింది. ఇప్పుడు సబ్‌స్క్రైబర్లందరికీ ఫ్రీగా మూవీ చూసే అవకాశం కల్పించనుంది.

బ్యాడ్ న్యూస్ స్టోరీ ఏంటి?

ఒకే తల్లికి ఇద్దరు తండ్రుల ద్వారా కవలలు ఎలా పుడతారన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో సలోని బగ్గా అనే చెఫ్ పాత్రలో తృప్తి నటించింది.

ఆమె తన మాజీ భర్త, బాయ్‌ఫ్రెండ్ తో శారీరక సంబంధం కారణంగా అనూహ్యంగా కవలలను తన కడుపులో మోస్తుంది. సాధారణంగా గర్భం దాల్చడం గుడ్ న్యూసే అయినా.. ఆ బిడ్డకు ఇద్దరు తండ్రులన్న భిన్నమైన కాన్సెప్ట్ తోపాటు బ్యాడ్ న్యూస్ అనే టైటిల్ తోనూ మేకర్స్ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

బ్యాడ్ న్యూస్ బాక్సాఫీస్ సక్సెస్

జులై 19న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ ఏడాది రిలీజైన హిందీ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఏడో మూవీగా నిలిచింది. రూ.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.115.74 కోట్లు వసూలు చేసింది. తొలి రోజే రూ.8.3 కోట్లతో మొదలై.. ఫస్ట్ వీకెండ్ రూ.44.1 కోట్లు వసూలు చేసింది.

నిజానికి ఈ సినిమా టైటిల్ ను మొదట మేరే మెహబూబ్ మేరే సనమ్ అనే టైటిల్ పెట్టినా.. తర్వాత బ్యాడ్ న్యూస్ గా మార్చారు. ఈ మూవీలో విక్కీ కౌశల్ తౌబా తౌబా సాంగ్ పై చేసిన డ్యాన్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ పాట ద్వారా కూడా మూవీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.