Tripti dimri: బోల్డ్ హీరోయిన్ తృప్తి డిమ్రీ షరారా డ్రెస్‌లో పద్ధతిగా కనిపిస్తోంది, మీ ఈ ఫ్యాషన్ ఫాలో అయిపోండి-bold heroine tripti dimri looks stylish in sharara dress follow this fashion ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tripti Dimri: బోల్డ్ హీరోయిన్ తృప్తి డిమ్రీ షరారా డ్రెస్‌లో పద్ధతిగా కనిపిస్తోంది, మీ ఈ ఫ్యాషన్ ఫాలో అయిపోండి

Tripti dimri: బోల్డ్ హీరోయిన్ తృప్తి డిమ్రీ షరారా డ్రెస్‌లో పద్ధతిగా కనిపిస్తోంది, మీ ఈ ఫ్యాషన్ ఫాలో అయిపోండి

Haritha Chappa HT Telugu
Aug 08, 2024 07:00 PM IST

Tripti dimri: నేషనల్ క్రష్ తృప్తి దిమ్రీ లేటెస్ట్ ఫోటో చూసి అభిమానులు ఆశ్చర్యపోవడం ఖాయం. ఆమె యానిమల్ సినిమాలో బోల్డ్ గా కనిపించి కుర్రకారు మనసు కొల్లగొట్టింది. ఇప్పుడు షరారా డ్రెస్ లో ఎంతో పద్దతిగా, సంప్రదాయకంగా కనిపిస్తోంది.

తృప్తి దిమ్రీ
తృప్తి దిమ్రీ (हिन्दुस्तान)

యానిమల్ సినిమాతో తృప్తి దిమ్రీ నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఆమె ఆ ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఫోటోల కోసం ఇంటర్నెట్లో రోజు వెతికే కుర్రకారు ఎంతో మంది. తృప్తి కూడా తక్కువేమీ కాదు, ఫిగర్ ఫిట్టింగ్ డ్రెస్‌లలో బోల్డ్ లుక్‌లో కనిపించి అభిమానులను మురిపిస్తుంది. అయితే ఇప్పుడు దేశీ ఇండియన్ డ్రెస్‌లో రెడీ అయి ఒక్కసారిగా షాకిచ్చింది. తాజా ఫోటోల్లో సినిమా ప్రమోషన్ కోసం తృప్తి షరారా ధరించి ఎంతో పద్ధతిగా కనిపించిది. ఇందులో కూడా కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. అయితే, తృప్తి దిమ్రీ లేటెస్ట్ ఫోటోలను చూస్తే అమ్మాయిలు రక్షాబంధన్ కు రెడీ అవ్వడానికి సరైన ఫ్యాషన్ అని చెప్పుకోవచ్చు.

శ్రావణమాసంలో ఎన్నో పండుగలు. రక్షా బంధన్, వరలక్ష్మీ వ్రతం ఇలా పండుగుల వస్తున్నాయి. పండుగ సీజన్‌కు తగ్గట్టుగానే తృప్తి లావెండర్ కలర్ షరారా సెట్‌ను ఎంచుకుంది. పొట్టి కుర్తీ, పలాజోలో అందంగా కనిపిస్తోంది. అదే సమయంలో భుజంజై కిందకు జాలువారేలో దుపట్టా వేసుకుని తన లుక్ ను పూర్తి చేసింది. చెవులకు పెద్ద చెవిపోగులు, చేతిలో ఉండే బ్రేస్ లెట్‌లతో చాలా సింపుల్ లుక్ లో ఉంది ఈ అందగత్తె. మినిమమ్ మేకప్, సైడ్ పార్టిషన్ హెయిర్‌తో నేతి తరం అమ్మాయికి కేరాఫ్ అడ్రస్‌లా ఉంది. మీరు కూడా తృప్తి దిమ్రీ లుక్ ను ఫాలో అవ్వచ్చు.

ఈ పండుగ సీజన్లో ట్రెడిషనల్ లుక్ కోసం పొట్టి కుర్తీ లేదా షార్ట్ టాప్‌ను పలాజ్జోతో జత చేయండి. స్టైలిష్ గా కూడా కనిపిస్తారు. సిల్వర్ ఆక్సిడైజ్ ఆభరణాలు ఎల్లప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. కాబట్టి రక్షాబంధన్ రోజున ఈ రకమైన ఆభరణాలను ధరించవచ్చు. నుదుటిన బొట్టు మాత్రం మర్చిపోవద్దు. బొట్టుతో లుక్ పూర్తవుతుంది. మీరు ఎథ్నిక్ దుస్తులలో బొట్టును ధరిస్తేనే అందం.

సాధారణంగా అమ్మాయిలు నెక్ పీస్ లు ధరించడానికి ఇష్టపడతారు. అయితే ట్రెండీ లుక్ కావాలంటే నెక్ పీస్‌లకు బదులు గాజులు, బ్రేస్ లెట్ ల కోసం డబ్బులు వెచ్చించండి. లేత రంగులు, లైట్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్స్ కూడా పండుగలో అందంగా కనిపిస్తాయి. లేత రంగులతో మేకప్ వేసుకుని మీరు మరింత అందంగా కనిపించవచ్చు.

తృప్తి దిమ్రీ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన అమ్మాయి. 2017 నుంచి సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. అయితే ఆమెకు గుర్తింపును తెచ్చిన సినిమా మాత్రం గతేడాది విడుదలైన యానిమల్ సినిమా. ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కొట్టడంతో వరుసపెట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో తృప్తి దిమ్రీ చాలా బిజీగా ఉంది.

టాపిక్