OTT Action Thriller: ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
OTT Action Thriller: ఓటీటీలోకి ఇప్పుడు ఓ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. హిందీలో ఈ ఏడాది వచ్చిన హిట్ సినిమాల్లో ఒకటైన కిల్ ను ఇప్పుడు తెలుగుతోపాటు మరో రెండు భాషల్లోనూ చూడొచ్చు.
OTT Action Thriller: ఓటీటీల్లో నేరుగా తెలుగు సినిమాలే కాదు.. వివిధ భాషలకు చెందిన హిట్ సినిమాలు డబ్ అయి వస్తున్నాయి. దీనివల్ల ఇక్కడి ప్రేక్షకులు తమకు నచ్చిన భాషల్లోని సినిమాలను సులువుగా చూసేస్తున్నారు. అలా హిందీలో ఈ ఏడాది వచ్చిన బ్లాక్ బస్టర్ అయిన కిల్ మూవీ కూడా ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
కిల్ మూవీ తెలుగులో..
కిల్ ఈ ఏడాది మోస్ట్ వయోలెంట్ సినిమాగా పేరుంది. జులై 5న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సెప్టెంబర్ 6 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే ఈ 20 రోజులూ కేవలం హిందీలోనే అందుబాటులో ఉన్న ఈ సినిమా మంగళవారం (సెప్టెంబర్ 24) నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లోనూ చూసే వీలు కలిగింది. అత్యంత హింసాత్మక సినిమాగా ఈ కిల్ పేరుగాంచింది. బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.50 కోట్ల వరకూ వసూలు చేసింది.
కిల్ మూవీ ఎలా ఉందంటే?
కిల్ మూవీ ఓ యాక్షన్ థ్రిల్లర్. చాలా వరకూ రైల్లోనే సాగే మూవీ ఇది. ఢిల్లీ నుంచి రాంచీకి వెళ్లే రైలుపై బందిపోట్లు చేసిన దాడిని ఈ మూవీలోని హీరో ఎలా తిప్పికొడతాడు.. ఆ రైల్లోనే ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్ తో పాటు మిగిలిన ప్రయాణికులను ఎలా కాపాడుతాడన్నదే ఈ సినిమా స్టోరీ.
గతేడాది సెప్టెంబర్ లో తొలిసారి టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించిన ఈ సినిమాకు థియేటర్లలోనూ తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. గతేడాది వచ్చిన యానిమల్ మూవీని మించిన హింసతో ఈ మూవీ సాగుతుంది.
కిల్ చిత్రాన్ని ప్యూర్ యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు నిఖిల్ నగేశ్ భట్ తెరకెక్కించారు. ఎక్కువగా బ్యాక్‍స్టోరీలు, పక్కదోవ పట్టే సీన్లు లేకుండా యాక్షన్‍తోనే చిత్రాన్ని ముందుకు నడిపించారు. పాటలు లేకపోవటం కూడా ప్లస్. ఈ చిత్రంలో యాక్షన్ సీన్ల కొరియోగ్రఫీ, కెమెరా యాంగిల్స్ మెప్పిస్తాయి.
యాక్షన్‍లో ఇంటెన్సిటీ కనిపిస్తుంది. దీంతోపాటు ఎమోషన్ కూడా మిస్ కాదు. ఈ చిత్రంలో యాక్షన్ కొరియోగ్రఫీ కూడా మెప్పిస్తుంది. ఫైట్లను రూపొందించిన తీరు ఆకట్టుకుంటుంది. యాక్షన్‍ను ఇష్టపడే వారికి కిల్ చిత్రం బాగా నచ్చుతుంది. ఇప్పుడు తెలుగులోనూ అందుబాటులోకి రావడంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా ఈ మూవీని చూడొచ్చు.