OTT Action Thriller: పది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ-ott action thriller hollywood movie fast charlie now streaming in telugu on amazon prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: పది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Action Thriller: పది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

Hari Prasad S HT Telugu
Sep 26, 2024 02:02 PM IST

OTT Action Thriller: ఓటీటీలోకి ఓ యాక్షన్ థ్రిల్లర్ హాలీవుడ్ మూవీ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు పది నెలల తర్వాత ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

పది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
పది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులోనూ వచ్చిన సూపర్ హిట్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ

OTT Action Thriller: హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని అభిమానించే ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్. తాజాగా ఆ జానర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చింది. గతేడాది డిసెంబర్ 8న రిలీజైన ఈ మూవీ.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లిష్ తోపాటు తెలుగులోనూ అందుబాటులోకి రావడం విశేషం. ఈ సినిమా పేరు ఫాస్ట్ ఛార్లీ.

ఫాస్ట్ ఛార్లీ ఓటీటీ స్ట్రీమింగ్

అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫాస్ట్ ఛార్లీ గురువారం (సెప్టెంబర్ 26) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా ఇంగ్లిష్ తోపాటు తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఒకేసారి డిజిటల్ ప్రీమియర్ అయింది. ఫిలిప్ నోయ్స్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పియర్స్ బ్రోస్నన్ లీడ్ రోల్లో కనిపించాడు.

మొరెనా బాకారిన్, జేమ్స్ కాన్ లాంటి వాళ్లు నటించారు. 2001లో వచ్చిన గన్ మాంకీస్ అనే నవల ఆధారంగా ఈ ఫాస్ట్ ఛార్లీ మూవీని తెరకెక్కించారు. గతేడాది డిసెంబర్ 8న రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. యాక్షన్ థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఈ ఫాస్ట్ ఛార్లీ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు.

చైనీస్ మూవీ కూడా తెలుగులో..

ఇక ప్రైమ్ వీడియోలోకే గురువారం (సెప్టెంబర్ 26) ఓ చైనీస్ మూవీ కూడా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా పేరు క్లౌడీ మౌంటేన్స్. మాండరిన్ తోపాటు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రకృతి విపత్తుల కారణంగా ప్రమాదంలో చిక్కుకున్న ఓ చిన్న ఊరు, అక్కడ కొత్తగా నిర్మించిన టన్నెల్ ను కాపాడటానికి తండ్రీకొడుకులు కలిసి చేసే ప్రయత్నమే ఈ సినిమా. 2021లో రిలీజైన ఈ మూవీ మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఇండియాలోనూ వివిధ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

తెలుగులో మరో మూడు సినిమాలు..

గురువారం (సెప్టెంబర్ 26) తెలుగులోనూ మరో మూడు సినిమాలు కూడా రావడం విశేషం. నెట్‌ఫ్లిక్స్, ఆహా వీడియో, ఈటీవీ విన్ ఓటీటీల్లో ఈ మూవీస్ ఉన్నాయి. వీటిలో ఒకటి నాని నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సరిపోదా శనివారం. గత నెల 29న థియేటర్లలో రిలీజై రూ.100 కోట్లకుపైనే వసూలు చేసిన ఈ సినిమా.. గురువారం నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇక ఈటీవీ విన్ ఓటీటీలో ఓ చిన్న సినిమా ఆర్టీఐ స్ట్రీమింగ్ కు వచ్చింది. సమాచార హక్కు చట్టం విశిష్టతను చాటుతూ సాగే ఓ లీగల్ థ్రిల్లర్ మూవీ ఇది. మరోవైపు ఆహా వీడియోలో మలయాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చాప్రా మర్డర్ కేస్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.

Whats_app_banner