Simhadri Re Release : ఆ రోజున ఎన్టీఆర్ సింహాద్రి రీ-రిలీజ్-ntr simhadri movie re release on may 20 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Simhadri Re Release : ఆ రోజున ఎన్టీఆర్ సింహాద్రి రీ-రిలీజ్

Simhadri Re Release : ఆ రోజున ఎన్టీఆర్ సింహాద్రి రీ-రిలీజ్

Anand Sai HT Telugu
Jan 17, 2023 07:20 PM IST

NTR Simhadri Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ సినిమా సింహాద్రి. ఇప్పుడు రీ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. 4కే వెర్షన్ ప్రింట్ రెడీ అవుతోంది. త్వరలోనే విడుదల చేయనున్నారు.

సింహాద్రి రీ రిలీజ్
సింహాద్రి రీ రిలీజ్ (twitter)

టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్(Re Release) ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు వరుస పెట్టి మళ్లీ విడుదల చేస్తున్నారు. కాస్త అప్ గ్రేడ్ చేసి.. క్వాలిటీతో తీసుకొస్తున్నారు. హీరోల బర్త్ డేలు, స్పెషల్ రోజుల్లో వీటిని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. ఫ్యాన్స్ సైతం.. తమ హీరోను పాత సినిమాలో మళ్లీ స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ ట్రెండ్ ఇటీవలి కాలంలో ఎక్కువైంది. 4కే వెర్షన్ లో అప్ డేట్ చేసి.. థియేటర్లలో వదులుతున్నారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan), మహేశ్ బాబు, బాలయ్య, ప్రభాస్(Prabhas) సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. రీ రిలీజ్ లకు రెస్పాన్స్ తోపాటుగా మంచి బిజినెస్ కూడా జరుగుతోంది.

అయితే మరికొన్ని రోజుల్లో మరో సూపర్ డూపర్ హిట్ సినిమా సింహాద్రి(Simhadri) విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్. సింగమలై అంటూ ఆ సమయంలో ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేవి. ఇప్పుడు మరోసారి విడుదల అవుతుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 4కే వెర్షన్ లో అప్డేట్ చేసి ప్రింట్ సిద్ధం చేస్తున్నారట.

అప్పుడే ఈ సినిమా ఓ సెన్సేషన్.. ఇప్పుడు రీ రిలీజ్ తర్వాత.. రికార్డ్ బ్రేక్ చేసేలా వసూళ్లు సాధిస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాను తారక్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బర్త్ డే మే 20 రోజున రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్(NTR Fans) విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు.

ఈ మూవీ భారీ అంచనాల నడుమ 9 జులై 2003వ సంవత్సరంలో విడుదల అయింది. బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. అదిరిపోయే కలెక్షన్లు కూడా తీసుకొచ్చింది. రాజమౌళి(SS Rajamouli) దర్శకత్వంలో రూపొందిన సినిమాలో భూమిక చావ్లా , అంకిత హీరోయిన్లుగా నటించారు. నాజర్ ముఖ్యమైన పాత్రలో ఉన్నారు. విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా.. కీరవాణి(Keeravani) సంగీతం అందిచాడు. ఇప్పుడు ఈ సినిమా మళ్లీ 4కే వెర్షన్ లో థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పుటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ ఈవెంట్లో ఈ టీమ్ సందడి చేసింది. ఇటీవలే.. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్31 సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

Whats_app_banner