Nikhil On Spy Result: అభిమానులకు క్షమాపణలు చెప్పిన నిఖిల్ - స్పై రిజల్ట్‌పై ఇంట్రెస్టింగ్ పోస్ట్
Nikhil On Spy Result: స్పై రిజల్ట్ విషయంలో నిఖిల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలోవైరల్ అవుతోంది. మరోసారి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కానని ఈ పోస్ట్‌లో నిఖిల్ పేర్కొన్నాడు.
Nikhil On Spy Result: స్పై రిజల్ట్ విషయంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ అభిమానులను క్షమాపణలు చెప్పాడు. భవిష్యత్తులో క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కానని మాటిచ్చాడు. నిఖిల్ హీరోగా నటించిన స్పై మూవీ జూన్ 29న రిలీజైంది. తొలుత ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. '
కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి సమయం సర్ధుబాటు కాకపోవడంతో కేవలం తెలుగు భాషలో మాత్రమే ఈ మూవీని రిలీజ్ చేశారు. మరోవైపు కథలో కొత్తదనం లేకపోవడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
ఈ సినిమా రిజల్ట్‌పై బుధవారం నిఖిల్ స్పందించాడు. ట్విట్టర్లో ఓ లెటర్ పోస్ట్ చేశాడు. కాంట్రాక్ట్‌తో పాటు కంటెంట్ డిలే వల్ల హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోయామని నిఖిల్ పేర్కొన్నాడు.
పాన్ ఇండియన్ లెవెల్లో సరైన రీతిలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో విఫలమయ్యామని నిఖిల్ చెప్పాడు. అలాగేఓవర్సీస్లో 350కిపైగా తెలుగు ప్రీమియర్ షోస్ కూడా రద్దు కావడం బాధను కలిగించిందని నిఖిల్ చెప్పాడు.
"నాపై నమ్మకంతో సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రేక్షకుల నమ్మకాన్ని స్పైతో నిలబెట్టుకోలేకపోయాను. ఈ విషయంలో అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా. నా తదుపరి సినిమాల్ని పాన్ ఇండియన్ లెవెల్లో అనుకున్న టైమ్‌లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తానని మాటిస్తున్నా. అంతే కాకుండా ఎలాంటి ఒత్తిళ్లు ఎదురైనా మరోసారి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కానని తెలుగు ఆడియెన్స్‌కు ప్రామిస్ చేస్తున్నా" అని ఈ లేఖలో నిఖిల్ పేర్కొన్నాడు.
ఫైనల్ ఔట్పుట్ విషయంలో సంతృప్తి వచ్చిన తర్వాతే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని నిఖిల్ పేర్కొన్నాడు. స్పై రిజల్ట్‌పై నిఖిల్ చేసిన ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. స్పై సినిమాకు ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రానా దగ్గుబాటి అతిథి పాత్రను పోషించాడు.
టాపిక్