Niharika Dance Video Viral: నిహారిక పుష్ప, ఆర్ఆర్ఆర్ సిగ్నేచర్ స్టెప్స్‌.. నెట్టింట వీడియో వైరల్-niharika konidela dances pushpa and rrr songs and this video viral on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Niharika Dance Video Viral: నిహారిక పుష్ప, ఆర్ఆర్ఆర్ సిగ్నేచర్ స్టెప్స్‌.. నెట్టింట వీడియో వైరల్

Niharika Dance Video Viral: నిహారిక పుష్ప, ఆర్ఆర్ఆర్ సిగ్నేచర్ స్టెప్స్‌.. నెట్టింట వీడియో వైరల్

Maragani Govardhan HT Telugu
Sep 24, 2022 12:04 PM IST

Niharika Dance Pushpa Song: మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల తాజాగా తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోని సిగ్నేచర్ స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

<p>నిహారిక డ్యాన్స్ వీడియో వైరల్</p>
<p>నిహారిక డ్యాన్స్ వీడియో వైరల్</p> (Instagram)

Niharika Konidela Dance Video: నిహారిక కొణిదెల.. మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్‌గా అరంగేట్రం చేసి వెబ్ సిరీస్, సినిమాలతో తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది వివాహం చేసుకున్న ఈ కొణిదెలవారి అమ్మాయి.. సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే మధ్య మధ్యలో నిర్మాతగా పనిచేస్తూనే ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే నిహారిక.. తాజాగా సరికొత్త వీడియోతో ప్రేక్షకులను పలకరించింది. పుష్ప, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లోని సిగ్నేచర్ స్టెప్స్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నిహారిక.. తన ఫొటోలు, వీడియోలతో అభిమానులకు చేరువగా ఉంటుంది. తాజాగా పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాల్లోని సిగ్నేచర్ స్టెప్స్ వేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రముఖ కొరియోకాఫర్ మృణాళిని కిరణ్‌తో కలిసి కాలు కదిపింది.

ఈ వీడియోను గమనిస్తే.. వీరిద్దరూ ముందు పుష్ప సినిమాలోని రారా సామి, ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు, వారియర్ నుంచి బుల్లెట్టు బండి, బీస్ట్ నుంచి హబిబో, రాను రాను అంటూ చిన్నదో అనే పాటలకు నర్తించారు. వరుస పెట్టి ఈ పాటలు వస్తుండగా.. అందుకు తగినట్లుగా డ్యాన్స్‌తో అలరించారు. ఈ వీడియోను వీరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫస్ట్ టైమ్ మృణాళిని కిరణ్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్నా అంటూ నిహారిక స్పందించింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ వీడియోపై విశేషంగా స్పందిస్తున్నారు.

నిహారిక కొణిదెల మొదట యాంకర్‌గా అందరి దృష్టిని ఆకర్షించిందియ అనంతరం వెబ్‌సిరీస్‌ల్లో నటించడమే కాకుండా వాటికి నిర్మాతగానూ వ్యవహరించింది. అయితే 2016లో విడుదలైన ఒక మనస్సు సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. అక్కడ నుంచి తమిళంలో విజయ్ సేతుపతి ఒరు నాల్లా నాల్ పాతు సొల్రేన్, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్, సైరా నరసింహ రెడ్డి లాంటి చిత్రాల్లో కనిపించింది. గతేడాది చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది.

సంబంధిత కథనం