Rave Party | పార్టీలో నిహారిక.. ఆమె తండ్రి నాగబాబు రియాక్షన్ ఇదీ.. వీడియో
టాలీవుడ్‌లో మరోసారి రేవ్ పార్టీ, డ్రగ్స్ కలకలం సృష్టించాయి. అంతేకాదు ఈ పార్టీలో మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు కూతురు నిహారిక కూడా ఉందన్న వార్తలు మరింత సంచలనానికి దారితీశాయి.
టాలీవుడ్‌లో డ్రగ్స్ అనేది ఇప్పటిది కాదు. చాన్నాళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతూనే ఉంది. కొన్నేళ్ల కిందట ఈ డ్రగ్స్ కేసులో ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారన్న వార్తలు ఎంత సంచలనం సృష్టించాయో కూడా మనకు తెలుసు. అప్పట్లో ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకొని విచారణకు ఆదేశించింది. ఆ కేసు ఇంకా తేలనే లేదు.. మరోసారి టాలీవుడ్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని రాడిసన్ పబ్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత అయిన నాగబాబు కూతురు నిహారిక, బిగ్‌బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్‌లాంటి వాళ్లు ఉన్నట్లు వెల్లడైంది.
అయితే దీనిపై తాజాగా నిహారిక తండ్రి నాగబాబు స్పందించారు. ఆమె అక్కడ ఉన్నమాట వాస్తవమేనని కూడా ఆయన చెప్పడం గమనార్హం. దీనికి సంబంధించి తన స్పందనను ఓ వీడియో ద్వారా ఆయన వెల్లడించారు. ఆ వీడియోలో ఆయన ఏమన్నారంటే.. "గతరాత్రి రాడిసన్ బ్లూ పబ్‌లో జరిగిన ఘటనపై నేను స్పందించడానికి కారణం.. నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి ఉండటం వల్ల పబ్‌పై పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకూ షి ఈజ్ క్లియర్. ఆమెది ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారు. సోషల్, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి పుకార్లకు తావివ్వకూడదనే నేను ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఎవరూ పుకార్లు వ్యాప్తి చేయొద్దని కోరుతున్నాను" అని నాగబాబు చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్