Netflix Thriller Movies: నెట్‌ఫ్లిక్స్‌లో బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఇవే.. వీటిని ఒక్క నిమిషం కూడా మిస్ అవలేరు
Netflix Thriller Movies: నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి. వీటిని ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా చూడాలని అనిపిస్తుంది. ఈ సినిమాల్లో ఇంగ్లిష్ నుంచి తెలుగు వరకు అన్ని భాషల థ్రిల్లర్ సినిమాలు ఉండటం విశేషం. మరి ఆ మూవీస్ ఏంటో ఒకసారి చూసేయండి.
Netflix Thriller Movies: నెట్‌ఫ్లిక్స్ ప్రముఖ ఓటీటీల్లో ఒకటి. ఇందులో వివిధ భాషలకు చెందిన ఎంతో కంటెంట్ అందుబాటులో ఉంది. అయితే అందులో ప్రత్యేకంగా నిలిచేది మాత్రం థ్రిల్లర్ జానర్ మూవీసే. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం భాషల నుంచి చాలా థ్రిల్లర్ మూవీస్ ఇందులో చూడొచ్చు. మరి మీరు థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడే వాళ్లయితే ఈ సినిమాలను కచ్చితంగా చూడండి.
నెట్‌ఫ్లిక్స్ బెస్ట్ థ్రిల్లర్ మూవీస్
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉన్న వివిధ భాషల థ్రిల్లర్ మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం.
మహారాజా - తమిళం, తెలుగు
ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ మహారాజా. విజయ్ సేతుపతి 50వ సినిమాగా వచ్చిన ఈ మూవీ.. మొదటి నుంచీ చివరి వరకూ ఊహించని క్లైమ్యాక్స్ లతో అలరిస్తుంది.
ఇరట్టా - మలయాళం
ఇరట్టా ఓ మలయాళం థ్రిల్లర్ మూవీ. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పని చేసే కవలల చుట్టూ తిరిగే కథ. అందులో ఒకరు అనుమానాస్పద స్థితిలో పోలీస్ స్టేషన్ లో చనిపోవడం, దానిని అతని సోదరుడు ఎలా పరిష్కరించాడన్నది ఈ ఇరట్టా స్టోరీ. మంచి థ్రిల్ పంచే సినిమా.
జన గణ మన - మలయాళం
ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లీగల్ థ్రిల్లర్ మూవీ జన గణ మన. ఓ కాలేజీ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి, దానిని దర్యాప్తు చేసే పోలీస్ అధికారి, ఈ కేసుపై కోర్టులో వాదించే లాయర్ చుట్టూ తిరిగే కథే ఈ జన గణ మన.
విరూపాక్ష - తెలుగు
ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన మూవీ విరూపాక్ష. ఓ ఊళ్లో అనుమానాస్పద రీతిలో జరిగే వరుస హత్యల చుట్టూ తిరిగే కథ ఇది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలోనూ మంచి సక్సెస్ సాధించింది.
ఆ! - తెలుగు
హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఆ! మూవీ కూడా మంచి థ్రిల్ అందించేదే. ఆరేళ్ల కిందట వచ్చిన ఈ మూవీలో కాజల్, నిత్య మేనన్, ఈషా రెబ్బ, రెజీనా, ప్రియదర్శిలాంటి వాళ్లు నటించారు. టైటిల్ లాగే సినిమా కూడా ఓ భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది.
రెప్టైల్ - ఇంగ్లిష్
నెట్‌ఫ్లిక్స్ లో ఉన్న ఇంగ్లిష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెప్టైల్. ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనుమానాస్పద మృతిని ఇన్వెస్టిగేట్ చేసే ఓ డిటెక్టివ్ చుట్టూ తిరిగే కథ ఇది. మంచి థ్రిల్ ను పంచే సినిమా ఇది.
ది కాల్ - కొరియన్
ఈమధ్యే హిందీలో వచ్చిన గ్యారా గ్యారా వెబ్ సిరీస్ ను పోలి ఉండే సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ది కాల్. తన చిన్ననాటి ఇంటిలోకి తిరిగి వచ్చిన ఓ అమ్మాయికి అక్కడి పాత ఫోన్ ద్వారా ఓ వృద్ధురాల పరిచయం అవుతుంది. నిజానికి ఆమె 20 ఏళ్ల కిందట ఆ ఇంట్లో నివసించిన వ్యక్తి. ఇలా రెండు వేర్వేరు కాలాల్లో వ్యక్తుల జీవితాలను ఈ ఫోన్ కాల్ ఎలా మార్చేసిందన్నది ఇందులో చూడొచ్చు.
స్పైడర్ హెడ్ - ఇంగ్లిష్
స్పైడర్ హెడ్ ఓ సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. తన శిక్షాకాలాన్ని తగ్గించుకునేందుకు ఇద్దరు వ్యక్తులు కొత్తగా తీసుకురాబోయే డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమవుతారు. ఆ క్రమంలో వాళ్లకు కొన్ని నమ్మలేని నిజాలు తెలుస్తాయి. మొదటి నుంచి చివరి వరకు మంచి థ్రిల్ పెంచే మూవీ ఇది.