Nani Dasara Movie: నాని ద‌స‌రా క్లైమాక్స్ యాక్ష‌న్ సీన్ లీక్-nani dasara movie climax action scene leaked on social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Nani Dasara Movie Climax Action Scene Leaked On Social Media

Nani Dasara Movie: నాని ద‌స‌రా క్లైమాక్స్ యాక్ష‌న్ సీన్ లీక్

Nelki Naresh Kumar HT Telugu
Jan 09, 2023 09:39 AM IST

Nani Dasara Movie: నాని హీరోగా న‌టిస్తోన్న ద‌స‌రా సినిమా క్లైమాక్స్ వీడియో సీన్ లీకైంది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

నాని
నాని

Nani Dasara Movie: ద‌స‌రా సినిమా షూటింగ్‌ను ముగించే ప‌నిలో హీరో నాని బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో గ‌త కొద్ది రోజులుగా క్లైమాక్స్ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తికానున్న‌ట్లు తెలిసింది. కాగా ఈ యాక్ష‌న్ ఎపిసోడ్ తాలూకు వీడియో సోమ‌వారం సోష‌ల్ మీడియాలో లీకైంది. ఈ వీడియోలో నాని ర‌గ్గ్‌డ్ లుక్‌లో క‌నిపిస్తూ విల‌న్స్‌తో ఫైట్ చేస్తున్నారు.

నిర్మాణ సంస్థ ఎస్ఎల్‌వీ సినిమాస్ పేరుతో ఉన్న‌ ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది అఫీషియ‌ల్ అకౌంట్ అనే ఆలోచ‌న‌తో చాలా మంది నాని అభిమానులు ఈ వీడియోను షేర్ చేయ‌డం మొద‌లుపెట్టారు.

కానీ ఇది ఫేక్ అకౌంట్ అని తేలింది. ఈ లీక్‌డ్ వీడియోపై స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ సోష‌ల్ మీడియా నుంచి తొల‌గించింది. లీక్‌డ్ వీడియోను షేర్ చేయ‌వ‌ద్ద‌ని అభిమానుల‌ను రిక్వెస్ట్ చేసింది.

త్వ‌ర‌లోనే గ‌ట్టిగా అప్‌డేట్స్ ఇస్తామ‌ని వెల్ల‌డించింది. ద‌స‌రా సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాతోనే అత‌డు ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకిఎంట్రీ ఇస్తున్నాడు. గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బ్యాక్‌డ్రాప్‌లో స్నేహం, ప్రేమ అంశాల‌తో ఈసినిమా తెర‌కెక్కుతోంది.

ద‌స‌రా సినిమా కోసం త‌న లుక్‌, గెట‌ప్ పూర్తిగా మార్చుకొని ర‌ఫ్ లుక్‌లో నాని క‌నిపిస్తున్నాడు. ఈ క్యారెక్ట‌ర్ కోసం ప్ర‌త్యేకంగా తెలంగాణ యాస‌ను నేర్చుకున్న‌ట్లు నాని గ‌తంలో ప్ర‌క‌టించాడు.

ఈ సినిమాలో కీర్తిసురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎమ్‌సీఏ త‌ర్వాత నాని, కీర్తిసురేష్ జంట‌గా న‌టిస్తోన్న సినిమా ఇది. ఈ ఏడాది మార్చి 30న ద‌స‌రా సినిమా రిలీజ్ కానుంది.

IPL_Entry_Point

టాపిక్