Most Liked Instagram Photo: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన ఫొటో ఇదే.. ఆ హీరోయిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లి-most liked instagram photo in india virat kohlis world cup winning photo overtakes kiara siddharth wedding photo ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Liked Instagram Photo: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన ఫొటో ఇదే.. ఆ హీరోయిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లి

Most Liked Instagram Photo: ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన ఫొటో ఇదే.. ఆ హీరోయిన్ రికార్డు బ్రేక్ చేసిన కోహ్లి

Hari Prasad S HT Telugu
Jul 01, 2024 02:21 PM IST

Most Liked Instagram Photo: ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువ మంది లైక్ చేసిన ఫొటో ఏదో తెలుసా? ఇన్నాళ్లూ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ పేరిట ఉన్న ఆ రికార్డును కోహ్లి ఫొటో బ్రేక్ చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన ఫొటో ఇదే.. కోహ్లికి దక్కిన అరుదైన ఘనత
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన ఫొటో ఇదే.. కోహ్లికి దక్కిన అరుదైన ఘనత (HT_PRINT)

Most Liked Instagram Photo: టీమిండియా తాజాగా టీ20 వరల్డ్ కప్ అందుకున్న ఫొటో ఇప్పుడు రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఈ ఫొటోను స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఎక్కువ మంది లైక్ చేసిన ఫొటోగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ ఈ రికార్డు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పేరిట ఉండగా.. ఆ రికార్డు బ్రేకయింది.

విరాట్ కోహ్లియా మజాకా?

టీమిండియా 17 ఏళ్ల తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలుసు కదా. అంతేకాదు 11 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ సందర్భాన్ని దేశమంతా ఓ ఉత్సవంలా జరుపుకుంది. ఆ కళ్లు చెదిరే విజయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అందులో రోహిత్ శర్మ ట్రోఫీ అందుకోగా.. మిగిలిన టీమంతా సంబరాలు జరుపుకుంటున్న ఫొటోను విరాట్ కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

ఈ ఫొటోకు ఇప్పుడు ఏకంగా 1.8 కోట్ల లైక్స్ రావడం విశేషం. ఇప్పుడీ ఫొటోనే ఇండియాలో ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కువ మంది లైక్ చేసిన ఫొటోగా నిలిచింది. ఇన్నాళ్లూ బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానా పెళ్లి ఫొటో పేరిట ఈ రికార్డు ఉండేది. ఆ ఫొటోకు 1.6 కోట్ల లైక్స్ వచ్చాయి. కోహ్లి షేర్ చేసిన ఫొటో ఒక రోజులోనే ఆ రికార్డు బ్రేక్ చేసేసింది.

"ఇలాంటి రోజును మించిన రోజును నేను కోరుకోలేదు. దేవుడు గొప్పోడు. ఆయన ముందు నేను తల వంచి నమస్కరిస్తున్నాను. మేము చివరికి సాధించేశాము. జై హింద్" అనే క్యాప్షన్ తో విరాట్ ఈ ఫొటోను షేర్ చేశాడు. గతేడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న కియారా, సిద్ధార్థ్ తమ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. దానికి 1.6 కోట్ల లైక్స్ వచ్చాయి.

ఇన్నాళ్లూ ఆ ఫొటో పేరిటే ఉన్న రికార్డు బ్రేకయింది. ఈ ఇద్దరి పెళ్లి ఫొటో కంటే ముందు.. ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ పెళ్లి ఫొటో పేరిట ఈ రికార్డు ఉండేది. ఆ ఫొటోకు 1.31 కోట్ల లైక్స్ వచ్చాయి. అయితే కోహ్లి ఫొటో మాత్రం ఒక రోజులోనే అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. రానున్న రోజుల్లో ఈ లైక్స్ ఇంకెంత వరకు వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మెస్సీ పేరిట రికార్డు

ఇండియాలో ఇప్పుడు కోహ్లి ఫొటోనే ఎక్కువ లైక్స్ పొందిన ఫొటో కాగా.. ప్రపంచంలో మాత్రం ఎక్కువ లైక్స్ వచ్చిన ఫొటోలో ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ పోస్ట్ చేసిన ఫొటో ఉంది. ఈ ఫొటోకు ఏకంగా 7.53 కోట్ల లైక్స్ వచ్చాయి. ఆ లెక్కన చూస్తే కోహ్లి ఫొటో ఇంకా చాలా దూరంలోనే ఉంది. అర్జెంటీనా 2022 ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన ఫొటోను మెస్సీ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు.

ఇక వరల్డ్ కప్ విషయానికి వస్తే సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో ఇండియా 7 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే. టోర్నీ అంతా విఫలమైన విరాట్.. ఫైనల్లో 76 రన్స్ తో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

WhatsApp channel