తెలుగు న్యూస్ / ఫోటో /
T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా మధుర క్షణాలు.. చరిత్రలో నిలిచిపోయే ఫొటోలు ఇవే
- T20 World Cup 2024 Final: 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఈ మధుర క్షణాలు, చరిత్రలో నిలిచిపోయే ఫొటోలను ఇక్కడ చూడండి.
- T20 World Cup 2024 Final: 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఈ మధుర క్షణాలు, చరిత్రలో నిలిచిపోయే ఫొటోలను ఇక్కడ చూడండి.
(1 / 8)
T20 World Cup 2024 Final: టీమిండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ గెలిచింది. దశాబ్దానికిపైగా ఉన్న నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికాను 7 పరుగులతో ఓడించి ఇండియన్ టీమ్ విశ్వవిజేతగా నిలిచింది. మరి చరిత్రలో నిలిచిపోయే ఆ మధుర క్షణాలను ఫొటోల్లో చూస్తారా?(Getty Images)
(2 / 8)
T20 World Cup 2024 Final: ఒక్క కప్పుతో ఈ ఇద్దరు లెజెండ్స్ కల నెరవేరింది. 15 ఏళ్లకుపైగా టీమిండియాకు సేవలందిస్తున్న వీళ్లు తాము ఆడుతున్న చివరి టీ20 వరల్డ్ కప్ లో ట్రోఫీని గెలిచి అనుకున్నది సాధించారు. 2007లో రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్, 2011లో కోహ్లి వన్డే వరల్డ్ కప్ గెలిచినా.. ఇద్దరూ కలిసి సాధించిన తొలి ట్రోఫీ మాత్రం ఇదే. ఈ విజయం తర్వాత ఈ ఇద్దరూ సగర్వంగా టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. ఈ వరల్డ్ కప్ మొత్తం విఫలమైన విరాట్.. ఫైనల్లో 76 పరుగులతో సత్తా చాటాడు.(REUTERS)
(3 / 8)
T20 World Cup 2024 Final: ఈ లెజెండరీ ప్లేయర్ కు ప్లేయర్ గా దక్కని వరల్డ్ కప్ ఓ కోచ్ గా దక్కింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ మిస్సయినా.. ఈసారి టీ20 వరల్డ్ కప్ తో అతడు టీమిండియా హెడ్ కోచ్ పదవికి సగర్వంగా వీడ్కోలు పలికాడు. హ్యాట్సాఫ్ లెజెండ్.(REUTERS)
(4 / 8)
T20 World Cup 2024 Final: టీమిండియాలో మరో లెజెండరీ ప్లేయర్ గా ఎదుగుతున్న బుమ్రానే ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడు 8 మ్యాచ్ లలో 15 వికెట్లతో సత్తా చాటాడు. బుమ్రా ఎకానమీ కూడా కేవలం 4.17 కావడం విశేషం. ఫైనల్లోనూ కీలకమైన రెండు వికెట్లు తీశాడు. ఈ వరల్డ్ కప్ గెలవడానికి అతడు పూర్తిగా అర్హుడు.(PTI)
(5 / 8)
T20 World Cup 2024 Final: తొలిసారి ఓ వరల్డ్ కప్ ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. చివరి మెట్టుపై బోల్తా పడింది. టీమిండియా చేతుల్లో ఓడి ఆ టీమ్ తీవ్ర నిరాశతో ఇంటిదారి పట్టింది. అయితే వాళ్ల ఆటతీరుతో దేశాన్ని గర్వపడేలా చేసింది.(ANI)
(6 / 8)
T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్ కప్ మొత్తం ఓపెనర్ గా వచ్చి తీవ్రంగా నిరాశపరిచిన విరాట్ కోహ్లి.. ఫైనల్లో అసలు టైమ్ లో చెలరేగాడు. అతడు 59 బంతుల్లో 76 రన్స్ చేయడం వల్లే టీమిండియా 176 పరుగుల ఫైటింగ్ టార్గెట్ ను సౌతాఫ్రికాకు ఇవ్వగలిగింది.(ANI)
(7 / 8)
T20 World Cup 2024 Final: క్లాసెన్ 27 బంతుల్లోనే 5 సిక్స్ లు, 2 ఫోర్లతో 52 పరుగులు చేసి భయపెట్టినా.. కీలకమైన సమయంలో హార్దిక్ పాండ్యా అతన్ని ఔట్ చేసి ఇండియా విజయాన్ని ఖాయం చేశాడు.(REUTERS)
ఇతర గ్యాలరీలు