తెలుగు న్యూస్ / ఫోటో /
Virat Kohli: క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు కోహ్లి - నాలుగు ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఏకైక క్రికెటర్ అతడే!
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నది టీమిండియా. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఈ ఫైనల్ మ్యచ్‌లో కోహ్లి 59 బాల్స్‌లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 76 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు.
(1 / 5)
23 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయిన టీమిండియాకు అక్షర్ పటేల్‌తో కలిసి భారీ స్కోరు అందించాడు కోహ్లి. ఈ వరల్డ్ కప్ ఫస్ట్ హాఫ్ సెంచరీ ని ఫైనల్‌లోనే సాధించాడు.
(2 / 5)
ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు కోహ్లి. ఈ వరల్డ్ కప్‌లో మిగిలిన ఏడు మ్యాచుల్లో కలిసి 75 రన్స్ చేసిన కోహ్లి, ఫైనల్‌లో మాత్రం 76 రన్స్‌తో అదరగొట్టాడు.
(3 / 5)
టీ20 వరల్డ్ విన్నర్‌గా టీమిండియా నిలవడం ద్వారా కోహ్లి అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. వన్డే వరల్డ్ కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ(2013), అండర్ 19 వరల్డ్ కప్ (2008)తో పాటు టీ20 వరల్డ్ కప్ ....నాలుగు ఐసీసీ టైటిల్స్ గెలిచిన ఏకైక ఇండియన్ క్రికెటర్ రికార్డ్ నెలకొల్పాడు.
(4 / 5)
టీ20 వరల్డ్ ఫైనల్ తర్వాత టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు కోహ్లి గుడ్‌బై చెప్పాడు. ఫైనల్ తన చివరి మ్యాచ్ అంటూ ప్రకటించాడు.
ఇతర గ్యాలరీలు