Tv Serial: కిల్ హీరో నటించిన టీవీ సీరియల్ బడ్జెట్ 500 కోట్లు - బాహుబలి కంటే సీరియల్ బడ్జెట్ ఎక్కువ!
Highest Budget Tv Serial: కిల్ హీరో లక్ష్ నటించిన పోరస్ ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన టీవీ సీరియల్‌గా రికార్డ్ నెలకొల్పింది. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సీరియల్ సోనీ లివ్‌లో టెలికాస్ట్ అయ్యింది. సీరియల్ బాహుబలిగా ప్రేక్షకుల ప్రశంసలను అందుకున్నది
Highest Budget Tv Serial: టీవీ సీరియల్ బడ్జెట్ మహా అయితే కోటిలోపే ఉంటాయి. యాక్టర్స్ రెమ్యునరేషన్స్, టెలికాస్ట్ టైమ్‌ను బట్టి ఒక్కోసారి సీరియల్ బడ్జెట్ రెండు, మూడు కోట్ల వరకు అవుతుంది. అంతకుమించి సీరియల్స్ బడ్జెట్ దాటడం అన్నది అరుదుగా కనిపిస్తోంది.
పోరస్ సీరియల్...
కానీ సోనీ టీవీలో టెలికాస్ట్ పోరస్ టీవీ సీరియల్ బడ్జెట్ ఏకంగా 500 కోట్లు కావడం గమనార్హం. ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సీరియల్‌గా పోరస్ రికార్డ్ క్రియేట్ చేసింది. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సీరియల్ 2017 నుంచి 2018 వరకు ఎడాది పాటు టెలికాస్ట్ అయ్యింది. 299 ఎపిసోడ్స్‌తోనే ఈ సీరియల్‌ను మేకర్స్ ముగించారు.
హైడాస్పస్ యుద్ధం...
అలెగ్గాండర్, పోరస్ మధ్య జరిగిన హైడాస్పస్ యుద్ధం నేపథ్యంలో దర్శకుడు సిద్ధార్థ్ కుమార్ తివారీ పోరస్ సిరీస్‌ను తెరకెక్కించారు. హైడాస్పస్ యుద్ధ కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా ఈ సీరియల్‌లో ఆవిష్కరించారు. థాయ్‌లాండ్‌కు చెందిన వన్‌లైఫ్ స్టూడియోస్ సంస్థ ఈ సీరియల్‌ను నిర్మించింది.ఈ సీరియల్ బడ్జెట్ బాహుబలి మూవీ కంటే రెండింతలు ఎక్కువే కావడం గమనార్హం.ఈ సీరియల్ బడ్జెట్ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
లక్ష్ లల్వానీ,
పోరస్ సీరియల్‌లో లక్ష్ లల్వానీ, రోహిత్ పురోహిత్, రతి పాండే, ఆదిత్య సమీక్ష కీలక పాత్రల్లో నటించారు. పోరస్ సీరియల్ బుల్లితెర అభిమానులను మెప్పించింది. సీరియల్ బాహుబలి అంటూ అభిమానులు ప్రశంసలు కురిపించారు.
భారీ బడ్జెట్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా విజువల్స్, గ్రాఫిక్స్‌తో దర్శకుడు ఈ సీరియల్‌ను తెరకెక్కించాడు. ఈ సీరియల్ అనేక అవార్డులను గెలుచుకుంది. పోరస్ పాత్రలో లక్ష్మ్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
కిల్ మూవీ...
ఈ సీరియల్‌లో పోరస్‌గా టైటిల్ రోల్‌లో నటించిన లక్ష్ లల్వానీ ఇటీవల రిలీజైన కిల్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో యాక్షన్ రోల్‌తో అదరగొట్టి ఆడియెన్స్‌ను మెప్పించాడు. కరణ్ జోహార్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
కిల్ మూవీ కథ మొత్తం ఒకే ట్రైన్‌లో సాగడం గమనార్హం. తనకు కాబోయే భార్యను చంపిన ఓ దోపిడీ దొంగల ముఠాపై ఆర్మీ ఎన్ఎస్‌జీ కమాండో ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నదే ఈ మూవీ కథ. కిల్ కంటే ముందు పోరస్‌తో పాటు ఆధూరీ కహానీ హమారీ, ప్యార్ తూనే క్యా కియాతో పాటు మరికొన్ని సీరియల్స్ చేశాడు లక్ష్.
టాపిక్