Most Expensive Scene: ఒకే ఒక్క సీన్ షూటింగ్ కోసం రూ.25 కోట్లు.. ఏడుగురు స్టార్లు.. హైదరాబాద్‌లోనే షూటింగ్
Most Expensive Scene: ఒకే ఒక్క సీన్ షూటింగ్ కోసం రూ.25 కోట్లు ఖర్చు చేయడం ఎప్పుడైనా చూశారా? ఈ బడ్జెట్ తో ఎన్నో సినిమాలే తీసేస్తున్నారు. కానీ ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.25 కోట్లతో ఓ సినిమాలో ఒకే ఒక్క సీన్ తీశారు. అది కూడా హైదరాబాద్ లో కావడం విశేషం.
Most Expensive Scene: ఇండియన్ సినిమాలో కల్కి 2898 ఏడీ, ఆర్ఆర్ఆర్, బాహుబలి, జవాన్ లాంటి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు ఈ మధ్యకాలంలో తెరకెక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలకు సాధ్యం కాని ఓ ఘనతను తాజాగా బాలీవుడ్ లో రాబోతున్న ఓ మూవీ సొంతం చేసుకోబోతోంది. ఆ మూవీలో ఒకే ఒక్క సీన్ తీయడానికి మేకర్స్ ఏకంగా రూ.25 కోట్లు ఖర్చు చేస్తుండటం విశేషం.
క్లైమ్యాక్స్ సీన్ కోసం రూ.25 కోట్లు
బాలీవుడ్ లో ఇప్పుడో సినిమా తెరకెక్కుతోంది. ఆ మూవీ పేరు సింగం అగైన్. ఈ సినిమా నవంబర్ 1న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీలో కేవలం క్లైమ్యాక్స్ సీన్ కోసమే రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారన్న వార్త సినిమా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సీన్ ను హైదరాబాద్ లోనే తీయడం విశేషం.
ఈ సినిమాను రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఆ లెక్కన మొత్తం బడ్జెట్ లో 10 శాతం కేవలం క్లైమ్యాక్స్ సీన్ కోసమే ఖర్చు చేస్తుండటం విశేషం. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే మేకర్స్ అసలు కాంప్రమైజ్ కావడం లేదు.
ఒకే సీన్‌లో ఏడుగురు స్టార్లు
సింగం అగైన్ మూవీ క్లైమ్యాక్స్ సీన్ కు ఇంత భారీ ఖర్చు ఎందుకు అనే ప్రశ్నకు అందులో నటించబోయే నటీనటులను చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీ క్లైమ్యాక్స్ సీన్‌లో బాలీవుడ్ టాప్ స్టార్లు అజయ్ దేవగన్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకోన్, కరీనా కపూర్, అర్జున్ కపూర్ కనిపించనున్నారు.
డీసీపీ బాజీరావ్ సింగంగా అజయ్ దేవగన్, ఏసీపీ సింబాగా రణ్‌వీర్ సింగ్, డీసీపీ వీర్ సూర్యవర్శిగా అక్షయ్ కుమార్, ఏసీపీ సత్యగా టైగర్ ష్రాఫ్, ఏసీపీ శక్తి శెట్టిగా దీపిక, ఏసీపీ అవనీ కామత్ సింగంగా కరీనా కపూర్ నటిస్తున్నారు. ఇక వీళ్లందరికీ ఎదుర్కోబోయే ఏకైక విలన్ దంగర్ లంకగా అర్జున్ కపూర్ కనిపించబోతున్నాడు.
రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్
బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకడైన రోహిత్ శెట్టి క్రియేట్ చేసిన పోలీస్ యూనివర్స్ లో ఈ సింగం అగైన్ ఐదో సినిమాగా రాబోతోంది. 2011లో సింగం మూవీతో ఇది ప్రారంభం కాగా.. ఇప్పటికే సింగం రిటర్న్స్, సింబా, సూర్యవన్శి సినిమాలు తెరకెక్కాయి.
ఆ సినిమాల్లో నటించిన స్టార్లందరూ ఇప్పుడీ సింగం అగైన్ లో కనిపించబోతున్నాడు. దీపావళి సందర్భంగా మూవీ థియేటర్లలోకి రాబోతోంది. అదే సమయంలో కార్తీక్ ఆర్యన్ భూల్ భులయ్యా 3 కూడా రానుంది.