Highest Flops Hero: చేసింది 300 సినిమాలు - 200 ఫ్లాపులు - వరుసగా 33 డిజాస్టర్స్ - అయినా సూపర్ స్టార్ - హీరో ఎవరంటే
Highest Flops Hero: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఫ్లాపులు ఎదుర్కొన్న హీరోగా చెత్త రికార్డ్ బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి పేరిట ఉంది. సుదీర్ఘ కెరీర్‌లో మిథున్ చక్రవర్తి 300 సినిమాలు చేయగా అందులో రెండు వందలకుపైగా ఫ్లాప్స్ ఉన్నాయి.
Highest Flops Hero: ఓ హీరో కెరీర్‌లో నాలుగైదు ఫ్లాఫులు ఎదురైతే అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. అలాంటిది వరుసగా 33 ఫ్లాపులు ఎదురైతే ఇండస్ట్రీలో కనిపించడమే కష్టమవుతుంది. కానీ ఓ హీరో మాత్రం కెరీర్‌లో 200లకుపైగా ఫ్లాపులు ఎదురైనా సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు.ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి.
ఫస్ట్ మూవీతోనే నేషనల్ అవార్డ్...
దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో హిందీ, బెంగాళీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కలిపి 300 వరకు సినిమాలు చేశాడు మిథున్ చక్రవర్తి. 1976లో రిలీజైన బెంగాళీ మూవీ మృగయతో మిథున్ చక్రవర్తి యాక్టింగ్ కెరీర్ ప్రారంభమైంది. మృణాల్ సేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీతో తొలి అడుగులోనే బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. అదే ఏడాది విడుదలైన దో అంజానే మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
డిస్కో డ్యాన్సర్‌తో యూత్ హీరో...
మృగయా, దో అంజానేలో అసమాన నటనను కనబరిచిన మిథున్ చక్రవర్తికి అవకాశాలు క్యూ కట్టాయి. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ వచ్చాడు. 1982లో వచ్చిన డిస్కో డ్యాన్సర్ మూవీతో యూత్ ఐకాన్‌గా మారిపోయాడు.
ఈ మూవీలో అతడి యాక్టింగ్, డ్యాన్సులు, డైలాగ్స్, డ్రెస్టింగ్ స్టైల్‌కు యువతరం ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వద్ద డిస్కో డ్యాన్సర్ మూవీ వసూళ్ల సునామీని సృష్టించింది. వంద కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన డిస్కో డ్యాన్సర్ మూవీ ఇప్పటికీ బాలీవుడ్ సినీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగానిలిచింది.
స్టార్ హీరోగా...
డిస్కో డ్యాన్సర్ సూపర్ స్టార్‌గా మారిపోయాడు మిథున్ చక్రవర్తి. బాలీవుడ్‌లో అప్పటిసూపర్ స్టార్లు అమితాబ్‌బచ్చన్, రిషి కపూర్‌తో పాటు ఇతర అగ్ర కథానాయకుల లిస్ట్‌లో మిథున్ చక్రవర్తి చేరిపోయాడు. మిథున్ చక్రవర్తితో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు పోటీపడ్డారు.
కథల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రతి దర్శకుడితో మిథున్ చక్రవర్తి సినిమాలు చేశాడు. దాంతో అతడు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
వరుసగా 33 ఫ్లాపులు...
1976 నుంచి 2022 వరకు మిథున్ చక్రవర్తి 300 వరకు సినిమాలు చేయగా...అందులో రెండు వందలకుపైగా ఫ్లాపులున్నాయి. 1998 నుంచి 2007 వరకు తొమ్మిదేళ్ల కాలంలో మిథున్ చక్రవర్తి సినిమాలు 33 సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. ఈ ఫెయిల్యూర్స్ ఎఫెక్ట్ అతడిపై పెద్దగా పడలేదు.
అవశాలు తగ్గలేదు సరికదా మరింత పెరిగాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఫ్లాపులు ఎదుర్కొన్న హీరోగా చెత్త రికార్డ్ మిథున్ చక్రవర్తి పేరిటనే ఉంది. అతడి తర్వాత బాలీవుడ్ సీనియర్ హీరో జితేంద్ర రెండో స్థానంలో, ధర్మేంద్ర మూడో స్థానంలో ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కెరీర్‌లో 160 వరకు ఫ్లాపులున్నాయి.
తెలుగులో గోపాల గోపాల...
తెలుగులో పవన్ కళ్యాణ్, వెంకటేష్ హీరోలుగా నటించిన గోపాల గోపాల సినిమాలో మిథున్ చక్రవర్తి హీరోగా నటించాడు. ఇందులో బాబాగా నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ చేశాడు. అలాగే అది పినిశెట్టి హీరోగా నటించిన తెలుగు మూవీ మలుపులో కూడా విలన్ పాత్రలో కనిపించాడు మిథున్ చక్రవర్తి.
టాపిక్