Miss Shetty Mr Polishetty BO Collection: అనుష్క-నవీన్ మూవీ సూపర్ హిట్.. నిర్మాతలకు లాభాలు-miss shetty mr polishetty movie 7 days worldwide box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Miss Shetty Mr Polishetty Movie 7 Days Worldwide Box Office Collection

Miss Shetty Mr Polishetty BO Collection: అనుష్క-నవీన్ మూవీ సూపర్ హిట్.. నిర్మాతలకు లాభాలు

Sanjiv Kumar HT Telugu
Sep 14, 2023 12:41 PM IST

Miss Shetty Mr Polishetty 1st Week Collection: థియేటర్లలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమాకు కలెక్షన్స్ పర్వాలేదనిపిస్తున్నాయి. తాజాగా మూవీ వారం రోజుల వసూళ్లు చూస్తే..

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వారం రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వారం రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్

Miss Shetty Mr Polishetty 7 Days Collection: బ్యూటిఫుల్ అనుష్క చాలా గ్యాప్ తర్వాత నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. హీరోగా నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై మంచి పాజిటివ్ టాక్‍తో ప్రదర్శించబడుతోంది. దీంతో సినిమాకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. అలా 7వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 60 లక్షల షేర్ (నైజాం రూ. 31 లక్షలు, సీడెడ్‍ రూ. 5 లక్షలు, ఆంధ్ర రూ. 24 లక్షలు), రూ. 1.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

ఏపీ, తెలంగాణలో..

కామెడీ ఎంటర్టైనర్ అండ్ సరోగసీ విధానంతో ఫన్నీగా తెరకెక్కించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా. ఈ చిత్రానికి మహేష్ బాబు పచ్చిగొళ్ల దర్శకత్వం వహించారు. అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు వారం రోజులు అయ్యేసరికి కలెక్షన్స్ తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులకు నైజాం రూ. 5.26 కోట్లు, సీడెడ్ రూ. 85 లక్షలు, ఆంధ్రప్రదేశ్ రూ. 3.39 కోట్లు వచ్చాయి. మొత్తంగా రూ. 9.50 కోట్లు షేర్, రూ. 16.75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగలిగింది ఈ సినిమా.

వరల్డ్ వైడ్ కలెక్షన్స్

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి ఏడు రోజుల్లో ఏపీ తెలంగాణలో రూ. 9.50 కోట్లు రాగా.. కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.30 కోట్లు, ఓవర్సీస్‍లో రూ. 5.95 కోట్లు వసూళు అయ్యాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ. 16.75 కోట్ల షేర్, రూ. 32.45 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి.

లాభాలు

అంతేకాకుండా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.50 కోట్లను అధిగమించి నిర్మాతలు రూ. 3.25 కోట్ల లాభాలు గడించేలా చేసింది. దీంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ సూపర్ హిట్‍గా నిలిచింది. అంటే అనుష్క, నవీన్ కాంబోకు హిట్ పడింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.