Miss Shetty Mister Polishetty Twitter Review: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి రివ్యూ - అనుష్కకు హిట్ దక్కిందా?
Miss Shetty Mister Polishetty Twitter Review: అనుష్క, నవీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ గురువారం (సెప్టెంబర్ 7న) రిలీజైంది. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు మహేష్ బాబు. పి దర్శకత్వం వహించాడు.
Miss Shetty Mister Polishetty Twitter Review: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది అనుష్క. సరోగసీ కాన్సెప్ట్‌తో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు.
జాతిరత్నాలు సక్సెస్ తర్వాత నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహించాడు. షారుఖ్‌ఖాన్ జవాన్‌కు పోటీగా రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో అనుష్క, నవీన్ పొలిశెట్టిలకు హిట్ దక్కిందా? లేదా? అన్నది చూద్ధాం...
స్టాండప్ కమెడియన్…
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో ఓ కార్పొరేట్ కంపెనీలో పనిచేసే స్టాండప్ కమెడియన్‌గా నవీన్ పొలిశెట్టి కనిపించగా అన్విత అనే చెఫ్ పాత్రలో అనుష్క నటించింది. ఈ సినిమాకు నవీన్ పొలిశెట్టి క్యారెక్టర్, అతడి కామెడీ టైమింగ్ ప్లస్‌పాయింట్‌గా నిలిచాయని ఓవర్‌సీస్ ఆడియెన్స్ చెబుతున్నారు.
సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాల తర్వాత నవీన్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందని, ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ వరకు తన పంచ్‌లు, ప్రాసలతో నవ్వించాడని అంటున్నారు. అనుష్క క్యారెక్టర్ కంప్లీట్ ఎమోషనల్‌గా సాగుతుందని చెబుతున్నారు.
లండన్‌లో పనిచేసే అన్విత అనే చెఫ్‌గా అనుష్క క్యారెక్టర్‌ను పరిచయం చేయడం, ఆ తర్వాత ఓ బలమైన కారణం వల్ల తల్లి(జయసుధ)తో ఇండియాకు రావడం లాంటి సీన్స్‌తో ఫస్ట్ పదిహేను సినిమాలు స్లో గా సినిమా నడుస్తుందని ఓవర్‌సీస్ ఆడియెన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
ఎమోషన్ ప్లస్ కామెడీ...
ఫస్ట్ హాఫ్ కామెడీతో రన్ చేసిన డైరెక్టర్ సెకండాఫ్‌లో ఎమోషన్ ప్లస్ కామెడీ మిక్స్ చేసినట్లు చెబుతున్నారు. సరోగసీ కోసం నవీన్‌ను అనుష్క ఒప్పించడం, ఆమెను నవీన్ అర్థం చేసుకునే సీన్స్‌ను కన్వీన్సింగ్‌గా దర్శకుడు స్క్రీన్‌పై చూపించాడని అంటున్నారు. నవీన్, అతడి తండ్రి పాత్రధారి మురళీశర్మ క్యారెక్టర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్ లో ఫన్ హిలేరియస్‌గా వర్కవుట్ అయ్యిందని ట్వీట్స్ చేస్తున్నారు.
చివరకు లండన్ వెళ్లిపోయిన అనుష్కను నవీన్ పొలిశెట్టి కలవడంతో డీసెంట్ క్లైమాక్స్‌తో సినిమాను దర్శకుడు మహేష్ బాబు పి ఎండ్ చేశారని ఓవర్‌సీస్ ఆడియెన్స్ అభిప్రాయపడుతోన్నారు.
సీరియస్ కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు ఫన్‌తో బోర్ కొట్టకుండా డైరెక్టర్ ఈ సినిమాలో చూపించాడని చెబుతున్నారు. వల్గారిటీ లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ఉందని, అనుష్కకు మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని చెబుతోన్నారు.