Miss Shetty Mister Polishetty Collections: టాక్ బాగుంది కానీ...ఫ‌స్ట్ డే యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన అనుష్క మూవీ-miss shetty mister polishetty day 1 collections anushka shetty naveen polishetty movie average openings at box office ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Miss Shetty Mister Polishetty Collections: టాక్ బాగుంది కానీ...ఫ‌స్ట్ డే యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన అనుష్క మూవీ

Miss Shetty Mister Polishetty Collections: టాక్ బాగుంది కానీ...ఫ‌స్ట్ డే యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన అనుష్క మూవీ

HT Telugu Desk HT Telugu

Miss Shetty Mister Polishetty Collections: అనుష్క‌, న‌వీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించిన మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి తొలిరోజు యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. మౌత్‌టాక్ బాగున్నా క‌లెక్ష‌న్స్ విష‌యంలో ఈ సినిమా అంచ‌నాల్ని అందుకోలేక‌పోయింది.

మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి

Miss Shetty Mister Polishetty Collections: జ‌వాన్‌కు పోటీగా శుక్ర‌వారం రిలీజైన మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌స్ట్ డే పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది.టాక్ బాగున్నా...రిలీజ్‌కు ముందు నుంచి సినిమాపై పెద్ద‌గా బ‌జ్ లేక‌పోవ‌డం, అనుష్క (Anushka Shetty) ప్ర‌మోష‌న్స్‌కు దూరం కావ‌డంతో తొలిరోజు మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

శుక్ర‌వారం రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా నాలుగు కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ సినిమా ఓవ‌ర్‌సీస్‌లో మాత్రం ప‌ర్వాలేద‌నిపించింది. శుక్ర‌వారం రోజు ఓవ‌ర్‌సీస్‌లో ఈ సినిమాకు రెండు కోట్ల‌కుపైగా గ్రాస్‌ను కోటికిపైగా షేర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

తెలుగు రాష్ట్రాల్లో శుక్ర‌వారం డ‌బ్బింగ్ మూవీ జ‌వాన్ చాలా థియేట‌ర్స్‌లో హౌజ్‌ఫుల్ కాగా మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి రిలీజైన చాలా థియేట‌ర్స్ ఖాళీగా ద‌ర్శ‌న‌మిచ్చాయి. మౌత్ టాక్ కార‌ణంగా శ‌నివారం రోజు వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

న‌వీన్ పొలిశెట్టి కామెడీ ప్ల‌స్ పాయింట్‌...

స‌రోగ‌సీ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన త‌న‌ కామెడీ టైమింగ్‌, పంచ్‌ల‌తో ఆడియెన్స్‌ను మెప్పించాడు న‌వీన్ పొలిశెట్టి(Naveen Polishetty). ఇందులో సిద్దు అనే స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌గా న‌వీన్ పొలిశెట్టి న‌టించాడు.

అన్విత అనే చెఫ్ పాత్ర‌లో అనుష్క క‌నిపించింది. కృత్రిమ గ‌ర్భం ద్వారా త‌ల్లి కావాల‌ని అనుకోన్న అన్విత జీవితంలోని సిద్ధు ఎలా వ‌చ్చాడు? అన్విత‌ను ప్రేమించిన సిద్ధు...ఆమె కోరిక‌ను నెర‌వేర్చాడా? లేదా? అనే క‌థ‌తో డైరెక్ట‌ర్ మ‌హేష్ బాబు ఈ మూవీని తెర‌కెక్కించాడు. క్లిష్ట‌మైన అంశాన్ని కామెడీతో సింపుల్‌గా ఈ సినిమాలో చూపించాడు డైరెక్ట‌ర్‌.

మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి సినిమాను యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మించింది. మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి సినిమాతో దాదాపు మూడేళ్ల విరామం త‌ర్వాత అనుష్క టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది.