Godfather OTT Release date: గాడ్‌ఫాదర్ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే?-megastar chiranjeevi godfather ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Megastar Chiranjeevi Godfather Ott Release Date Locked

Godfather OTT Release date: గాడ్‌ఫాదర్ ఓటీటీ విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే?

Maragani Govardhan HT Telugu
Nov 02, 2022 12:53 PM IST

Godfather OTT Release date: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను నవంబరు 19 నుంచి నెట్‌ఫిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

గాడ్‌ఫాదర్ ఓటీటీ విడుదల తేదీ కన్ఫార్మ్
గాడ్‌ఫాదర్ ఓటీటీ విడుదల తేదీ కన్ఫార్మ్ (Twitter)

Godfather OTT Release date: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆచార్య సినిమాతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఆయన తన తదుపరి చిత్రం గాడ్‌ఫాదర్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా అక్టోబరు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగానూ అదరగొట్టింది. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందాని అభిమానులు ఎదురుచూడసాగారు.

ప్రస్తుతం ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను త్వరలోనే డిజిటల్ వేదికగా విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది. అంతేకాకుండా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసిందని సమాచారం. నవంబరు 19 నుంచి గాడ్‌ఫాదర్ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. త్వరలోనే ఈ విషయంపై చిత్రబృందం అధికారిక సమాచారాన్ని ఇవ్వనుందట.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన గాడ్‌ఫాదర్ చిత్రం అదిరిపోయే వసూళ్లను సాధించింది. ఈ సినిమా మొత్తం వంద కోట్ల పైచిలుకు వసూళ్లతో దుమ్మురేపింది. చిరంజీవి గత చిత్రం ఆచార్య ఫ్లాప్ టాక్‌ తెచ్చుకోగా.. ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేర్ చేసింది.

గాడ్‌ఫాదర్ అక్టోబరు 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నయనతార ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది సత్యదేవ్ కూడా ముఖ్యమైన క్యారెక్టర్ చేశారు. నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తోన్న ఈ సినిమాలో టాప్ క్లాస్ టెక్నికల్ టీమ్ పనిచేసింది. తమన్ సంగీత సారథ్యం వహించగా.. సురేశ్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ పతాకాలపై ఆర్బీ చైదురీ, ఎన్వీ ప్రసాద్, సురేఖ కొణిదెల నిర్మించారు.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.