Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే-manjummel boys ott release date this malayalam survival thriller ready to stream from may 5 midnight on disney plus ho ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Manjummel Boys Ott Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
May 04, 2024 07:07 PM IST

Manjummel Boys OTT Steaming Date: మంజుమ్మల్ బాయ్స్ సినిమా ఓటీటీలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో ఈ అర్ధరాత్రి (మే 5) ఈ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సినిమా ఓటీటీ డీటైల్స్ ఇవే.

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే
Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Manjummel Boys OTT: మలయాళ బ్లాక్‍బస్టర్ మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీ స్ట్రీమింగ్‍కు సమయం సమీపించింది. మలయాళ ఇండస్ట్రీలో ఆల్‍టైమ్ హిట్‍గా ఈ సినిమా నిలిచింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం కలెక్షన్లతో దుమ్మురేపింది. ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో మంజుమ్మల్ బాయ్స్ సినిమా ఈ అర్ధరాత్రి (మే 5) ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలివే..

ప్లాట్‍ఫామ్ ఇదే

మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (మే 5) స్ట్రీమింగ్‍కు రానుంది. దీంతో ఈ మూవీ స్ట్రీమింగ్ కోసం కోసం నిరీక్షణ తీరనుంది. ఈ అర్థరాత్రి అంటే మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్ హాట్‍స్టార్ ఓటీటీలో మొదలుకానుంది.

ఐదు భాషల్లో..

ముంజుమ్మల్ బాయ్స్ సినిమా మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ ఇప్పటికే ఖరారు చేసింది. దీంతో హాట్‍స్టార్ ఓటీటీలో రేపటి నుంచి మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని చూసేయవచ్చు.

సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మంజుమ్మల్ బాయ్స్ చిత్రాన్ని ఉత్కంఠగా, ఎంగేజింగ్‍గా తెరకెక్కించిన దర్శకుడు చిదంబరంపై ప్రశంసలు వచ్చాయి. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, దిలాన్ డెరిన్, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్ ప్రధాన పాత్రలు చేశారు.

మంజుమ్మల్ బాయ్స్ కలెక్షన్ల రికార్డులు

మంజుమ్మల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలుకొట్టింది. మలయాళ ఇండస్ట్రీలో చరిత్రను తిరగరాసింది. రూ.200 కోట్ల కలెక్షన్లను సాధించిన తొలి మలయాళం మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ఏకంగా రూ.242 కోట్ల కలెక్షన్లను సాధించింది. రూ.20కోట్లలోపు బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ ఇంత భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. తమిళంలోనూ ఈ మూవీ బ్లాక్‍బస్టర్ అయింది. తెలుగులో ఏప్రిల్ 6న థియేటర్లలో విడుదల కాగా.. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

70 రోజుల తర్వాత ఓటీటీలోకి..

మలయాళంలో థియేటర్లలో రిలీజైన సుమారు 70 రోజుల తర్వాత మంజుమ్మల్ బాయ్స్ సినిమా హాట్‍స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో నిరీక్షించారు. థియేట్రికల్ రన్ సుదీర్ఘంగా సాగటంతో ఓటీటీ రిలీజ్ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఎట్టకేలకు రేపు (మే 5) డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో ఈ మూవీ అడుగుపెట్టనుంది.

మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి పవర ఫిల్మ్స్ పతాకంపై సౌహిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి సుషీన్ శ్యామ్ సంగీతం అందించగా.. షైజూ ఖాలిద్ సినిమాటోగ్రఫీ చేశారు.

తమిళనాడులోని కొడైకెనాల్‍కు వెకేషన్‍కు వెళ్లిన ఫ్రెండ్స్ గ్రూప్‍లో ఓ వ్యక్తి ఆపదలో పడతాడు. అతడిని కాపాడేందుకు ఇతర స్నేహితులు చేసే ప్రయత్నాల చుట్టూ మంజుమ్మల్ బాయ్స్ మూవీ స్టోరీ సాగుతుంది. యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు చిదంబరం తెరకెక్కించారు.

Whats_app_banner