Ponniyin Selvan 2 Trp Rating: మ‌ణిర‌త్నం డ్రీమ్ సినిమాకు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ - బుల్లితెర‌పై డిజాస్ట‌ర్‌-maniratnam ponniyin selvan 2 telugu world television premiere gets disaster trp rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ponniyin Selvan 2 Trp Rating: మ‌ణిర‌త్నం డ్రీమ్ సినిమాకు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ - బుల్లితెర‌పై డిజాస్ట‌ర్‌

Ponniyin Selvan 2 Trp Rating: మ‌ణిర‌త్నం డ్రీమ్ సినిమాకు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్ - బుల్లితెర‌పై డిజాస్ట‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Sep 22, 2023 01:17 PM IST

Ponniyin Selvan 2 Trp Rating: పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 సినిమాకు తెలుగు ఆడియెన్స్ షాకిచ్చారు. మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఫ‌స్ట్ తెలుగు టీవీ ప్రీమియ‌ర్ అతి త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకున్న‌ది.

పొన్నియ‌న్ సెల్వ‌న్ 2
పొన్నియ‌న్ సెల్వ‌న్ 2

Ponniyin Selvan 2 Trp Rating: మ‌ణిర‌త్నం క‌ల‌ల ప్రాజెక్ట్‌గా రూపొందిన పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 తెలుగు టీవీ ప్రీమియ‌ర్‌కు షాకింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇటీవ‌ల జెమిని టీవీలో పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ టెలికాస్ట్ అయ్యింది. ఈ ఫ‌స్ట్ ప్రీమియ‌ర్‌కు కేవ‌లం 2.07 టీఆర్‌పీ రేటింగ్ మాత్ర‌మే వ‌చ్చింది. అర్బ‌న్ ఏరియాలో 2.55 టీఆర్‌పీ రేటింగ్‌ను ఈ మూవీ సొంతం చేసుకున్న‌ది. మ‌ణిర‌త్నం తెలుగు డ‌బ్బింగ్ సినిమాల్లో పొన్నియ‌న్ సెల్వ‌న్ అతి త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్‌ను ద‌క్కించుకున్న‌ది.

పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ 1 ఫ‌స్ట్ టీవీ ప్రీమియ‌ర్‌కు 2.73 టీఆర్‌పీ రేటింగ్ వ‌చ్చింది. పార్ట్ వ‌న్ కంటే అతి త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్‌ను సొంతం చేసుకొని సీక్వెల్ చెత్త రికార్డ్‌ను మూట గ‌ట్టుకున్న‌ది. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సీక్వెల్ మూవీ ఏప్రిల్ 28న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.

పార్ట్ వ‌న్‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల కార‌ణంగా పార్ట్ 2పై తెలుగులో పెద్ద‌గా బ‌జ్ లేక‌పోవ‌డంతో పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. పొన్నియ‌న్ సెల్వ‌న్ పార్ట్ 1 త‌మిళంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిల‌వ‌గా...సీక్వెల్ మాత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌గా కూడా బ్రేక్ ఈవెన్ ను కూడా కాలేక‌పోయింది. చోళ సామ్రాజ్యంలోని కుట్ర‌లు, కుతంత్రాల‌ను ఆవిష్క‌రిస్తూ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం ఈ సినిమాను తెర‌కెక్కించారు.

విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్య‌రాయ్, జ‌యంర‌వి, కార్తి, త్రిష‌, శోభిత ధూశిపాళ్ల‌తో పాటు ప‌లువురు త‌మిళ అగ్ర న‌టీన‌టులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి మ‌ణిర‌త్నం స్వ‌యంగా పొన్నియ‌న్ సెల్వ‌న్ సినిమాను నిర్మించారు.

WhatsApp channel