Malayalam Comedy Movie OTT Streaming: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ సూపర్ హిట్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..-malayalam super hit comedy movie malayalee from india to stream in sonyliv ott on friday july 5th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Malayalam Comedy Movie Ott Streaming: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ సూపర్ హిట్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

Malayalam Comedy Movie OTT Streaming: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ సూపర్ హిట్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

Hari Prasad S HT Telugu

Malayalam Comedy Movie OTT Streaming: ఈ ఏడాది వచ్చిన మరో మలయాళ సూపర్ హిట్ కామెడీ మూవీ మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ సూపర్ హిట్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

Malayalam Comedy Movie OTT Streaming: మలయాళం సినిమాకు 2024 ఒకరకంగా బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఏడాది ఆ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమానే మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఈ మూవీ మే 1న థియేటర్లలో రిలీజై ప్రేక్షకుల ఆదరణ సంపాదించగా.. ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు వస్తోంది.

మలయాళీ ఫ్రమ్ ఇండియా ఓటీటీ స్ట్రీమింగ్

మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీ ఓ కామెడీ డ్రామా. ఈ సినిమా శుక్రవారం (జులై 5) నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో అంతంతమాత్రం సక్సెసైన ఈ సినిమాను ఓటీటీలో మాత్రం సక్సెస్ చేయడానికి సోనీలివ్ ప్రయత్నిస్తోంది. అందుకే గత కొన్ని రోజులుగా తమ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తోంది.

ఈ సందర్భంగా ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేసింది. "నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాస్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ లతో అదరగొట్టిన బ్లాక్‌బస్టర్ మలయాళం మూవీ ఇది. మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీని జులై 5 నుంచి మీ సోనీలివ్ లో చూడండి" అనే క్యాప్షన్ తో ఆ ప్రోమోను షేర్ చేసింది.

నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాను డిజో జోస్ ఆంటోనీ డైరెక్ట్ చేశాడు. ఈ ఏడాది మోస్ట్ అవేటెడ్ రిలీజ్ లలో ఒకటిగా ఈ సినిమాను భావించారు. అయితే థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా అంతంతమాత్రంగానే వసూళ్లు వచ్చాయి.

ఈ సినిమాలో తన కుటుంబానికి భారంగా మారిన అలపరంబిల్ గోపి అనే పాత్రలో నివిన్ పౌలీ నటించాడు. ఓరోజు జరిగిన ఊహించని ఘటనతో అతడు తన ఇల్లు వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అతడు దేశం వదిలి దుబాయ్ వెళ్లిపోతాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. అతని జీవితంలో జరిగిన ఆ మార్పు ఏంటి? ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మలయాళీ ఫ్రమ్ ఇండియాలో చూడొచ్చు.

సోనీలివ్ మలయాళం మూవీస్

సోనీలివ్ ఓటీటీలో ఇప్పటికే కొన్ని సూపర్ హిట్ మలయాళం సినిమాలు ఉన్నాయి. అందులో ఈ ఏడాది రిలీజై సక్సెస్ సాధించిన భ్రమయుగం, వర్షంగల్కు శేషంతోపాటు మంజుమ్మెల్ బాయ్స్ కంటే ముందు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా పేరుగాంచిన 2018 కూడా ఉండటం విశేషం. ఇక దుల్కర్ సల్మాన్ నటించిన సెల్యూట్, మమ్ముట్టి నటించిన పురు సినిమాలు కూడా ఇదే ఓటీటీలో ఉన్నాయి.

సోనీలివ్ ఓటీటీ వివిధ సబ్‌స్క్రిప్షన్లతో అందుబాటులో ఉంది. నెలకు రూ.399తోపాటు ఏడాదికి రూ.1499 ప్లాన్స్ ఉన్నాయి. అంతేకాకుండా కేవలం మొబైల్లో చూడటానికి ఏడాదికి ప్రత్యేకంగా రూ.699 ప్లాన్ కూడా ఉంది.