తెలుగు న్యూస్ / ఫోటో /
Low Budget Horror Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన లో బడ్జెట్ హారర్ మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడాలంటే?
హారర్ సినిమాలను మినిమం గ్యారెంటీ జానర్‌గా చెబుతోంటారు. భాషా భేదాలతో సంబంధం లేకుండా యూనివర్సల్‌గా ఆడియెన్స్‌ను హారర్ మూవీస్ భయపెడుతోంటాయి. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన కొన్ని హారర్ సినిమాలు దక్షిణాదిలో ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచాయి. ఆ హారర్ సినిమాలు ఏవంటే?
(1 / 5)
విజయ్ సేతుపతి, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన హారర్ మూవీ పిజ్జా సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. కేవలం కోటి బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఎనిమిది కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఊహలకు అందని ట్విస్ట్‌లతో ఈ సినిమాను చివరి వరకు నడిపించి భయపెట్టారు డైరెక్టర్. పిజ్జా మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
(2 / 5)
మాధవన్, డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబోలో వచ్చిన 13బీ మూవీ బెస్ట్ హారర్ మూవీగా దక్షిణాది తో పాటు బాలీవుడ్ ప్రేక్షకుల మన్ననల్ని అందుకున్నది. చిన్న సినిమాగా రిలీజైన ఈ హారర్ మూవీ 25 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. 13 బీ మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
(3 / 5)
షేన్ నిగమ్, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళం హారర్ మూవీ భూతకాలం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హారర్ మూవీ మొత్తం ఒకే ఇంట్లో సాగుతుంది. ఈ సినిమా పలు అవార్డులను గెలుచుకుంది.
(4 / 5)
కోలీవుడ్ డైరెక్టర్ మిస్కిన్ తెరకెక్కిన పిశాచి మూవీ డిఫరెంట్ హారర్ మూవీగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. పిశాచి మూవీ తెలుగుతో పాటు తమిళంలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది.
ఇతర గ్యాలరీలు