OTT Malayalam Comedy Drama: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ కామెడీ డ్రామా చిత్రం.. తెలుగులోనూ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Vaazha: Biopic of a Billion Boys OTT Release Date: వాళ: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్ట్రీమింగ్ డేట్ కూడా ఖరారైంది. న్యూఏజ్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఓటీటీలో తెలుగులోనూ రానుంది. ఈ చిత్రం స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
మలయాళ కామెడీ డ్రామా చిత్రం ‘వాళ: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్’ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో సిజు సన్నీ, జోమోన్ జ్యోతియార్, అమిత్ మోహన్ లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి ఆనంద్ మీనన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. మంచి కలెక్షన్లను దక్కించుకొని హిట్ అయింది. ఈ వాళ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
‘వాళ: బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బాయ్స్’ సినిమా సెప్టెంబర్ 23వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని హాట్‍స్టార్ నేడు (సెప్టెంబర్ 18) అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది.
ఈ చిత్రం సెప్టెంబర్ 23న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తుందని హాట్‍స్టార్ కన్ఫర్మ్ చేసింది. థియేటర్లలో మలయాళం ఒక్కటే రిజైన ఈ చిత్రం ఓటీటీలో మరో నాలుగు డబ్బింగ్ భాషల్లో స్ట్రీమ్ అవనుంది.
వాళ మలయాళ చిత్రాన్ని యూత్‍కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు ఆనంద్ మీనన్. వయసు పెరిగే కొద్ది తల్లిదండ్రులతో పాటు సమాజం నుంచి యువకులపై వచ్చే ఒత్తిడిని ఈ చిత్రంలో చూపించారు. యూత్ ఎదుర్కొంటున్న సమస్యలను తెరకెక్కించారు. ఈ మూవీలో సిజూ సన్నీ, జ్యోతియర్, అమిత్‍తో పాటు సాఫ్ బ్రోస్, అనురాజ్, అన్షిద్, బాసిల్ జోసెఫ్, జగదీశ్, కొట్టాయమ్ నజీర్, నోబీ మార్కోస్ కీలకపాత్రలు పోషించారు.
కలెక్షన్లు ఇలా..
వాళ సినిమా కమర్షియల్‍గా సక్సెస్ అయింది. సుమారు రూ.4కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. దాదాపు రూ.40కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.
వాళ మూవీని డబ్ల్యూబీటీఎస్ పతాకంపై విపిన్ దాస్, హారిస్ దేసోమ్, పీబీ ఆనిశ్, ఆదర్శ్ నారాయణ్ నిర్మించారు. ఈ చిత్రానికి విపిన్ దాస్ కథ అందించారు. మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ ఆనంద్ మీనన్. ఈ చిత్రానికి అంకిత్ మీనన్ సంగీతం అందించగా.. అరవింద్ పుతుసెరీ సినిమాటోగ్రఫీ చేశారు.
జీవితంలో ఎలాంటి లక్ష్యం పెట్టుకోని ఐదుగురు స్నేహితుల కథతో వాళ మూవీ సాగుతుంది. అయితే, వారిపై తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు. వారు విఫలమవుతుండటంతో అందరూ లూజర్లుగా చూస్తారు. వయసు పెరిగే కొద్ది తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి పెరుగుతుంటుంది. ఆ ఐదుగురి మధ్య ఫ్రెండ్‍షిప్, కుటుంబ పరిస్థితులు, ప్రేమ, ఎదురయ్యే సవాళ్ల చుట్టూ ఈ మూవీ నడుస్తుంది. దేశంలో చాలా మంది యూత్ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్.