Lucky Baskhar OTT Release Date: నెల రోజుల్లోపే ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ మెగా బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
Lucky Baskhar OTT Release Date: దుల్కర్ సల్మాన్ మెగా బ్లాక్ బస్టర్ మూవీ లక్కీ భాస్కర్ నెల రోజుల్లోపే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ తేదీపై బజ్ నెలకొంది.
Lucky Baskhar OTT Release Date: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ లక్కీ భాస్కర్ వచ్చేస్తోందని తాజాగా ఓ బజ్ నెలకొంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజై ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధంగా ఉన్న ఈ మూవీ.. ఈ నెలలోనే ఓటీటీలోకి వస్తున్నట్లు సమాచారం.
లక్కీ భాస్కర్ ఓటీటీ రిలీజ్ డేట్
వెంకీ అట్లూరి డైరెక్షన్ లో దీపావళి సందర్భంగా రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ లక్కీ భాస్కర్. తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మరో బ్లాక్ బస్టర్ అందించిన ఈ సినిమా నవంబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. త్వరలోనే రావచ్చని అంచనా వేస్తున్నారు. రెండు వారాలుగా థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్న ఈ మూవీ.. ఇప్పటికే రూ.90 కోట్లకుపైగా వసూళ్లతో రూ.100 కోట్ల క్లబ్ కు చేరువైంది.
అలాంటి సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకొస్తుండటం విశేషం. ఈ సినిమాతోపాటే రిలీజైన అమరన్, క మూవీస్ ఓటీటీ రిలీజ్ లపై ఇప్పటి వరకూ అప్డేట్ లేదు. అయితే అమరన్ మాత్రం అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యం కానుందని స్పష్టమైంది. ఆ మూవీ రూ.250 కోట్ల మార్క్ కూడా అందుకోవడంతో మేకర్స్ డిజిటల్ ప్రీమియర్ ను ఆలస్యం చేస్తున్నారు. అటు కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పైనా అప్డేట్ రావాల్సి ఉంది.
లక్కీ భాస్కర్ కథేంటంటే?
దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగి చుట్టూ తిరుగుతుంది. ఇదొక పీరియడ్ డ్రామా. 1980ల నేపథ్యంలో జరిగిన కథగా తెరకెక్కించారు. ఎంతో కష్టపడినా ప్రమోషన్ దక్కని ఓ బ్యాంకు ఉద్యోగి.. తర్వాత అడ్డదారుల్లో భారీగా సొమ్ము సంపాదిస్తూ ఎదుగుతాడు.
ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో ఈ మూవీని తీసుకొచ్చిన వెంకీ అట్లూరి సక్సెస్ సాధించాడు. ఇప్పటికే తెలుగులో మహానటి, సీతారామంలాంటి హిట్స్ అందుకున్న దుల్కర్.. ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టాడు. మధ్యలో కల్కి 2898 ఏడీ మూవీలోనూ గెస్ట్ రోల్ పోషించిన విషయం తెలిసిందే.
ఈ లక్కీ భాస్కర్ మూవీని నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో తెరకెక్కించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ గా నటించింది. మూవీకి తెలుగుతోపాటు తమిళనాడు, కేరళల్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అక్కడా థియేటర్ల సంఖ్యను పెంచారు. అయితే నవంబర్ 30 నుంచే నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.